కెప్టెన్లు లేకుండా ఐపీఎల్ టీం... కుంబ్లేలా ఆలోచిస్తున్న సెహ్వాగ్...

IPL Final 2019 : ఐపీఎల్ టీం అంటే ఎలా ఉండాలన్నదానిపై ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అంచనాల్లో ఉన్నారు. ఐతే... కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఒకేలాంటి టీంను ప్రకటించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 12, 2019, 12:55 PM IST
కెప్టెన్లు లేకుండా ఐపీఎల్ టీం... కుంబ్లేలా ఆలోచిస్తున్న సెహ్వాగ్...
MS ధోనీ కోహ్లీ
  • Share this:
సమ్మర్‌లో జరిగిన ఐపీఎల్ పన్నెండో సీజన్ పై అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం... జరిగిన మ్యాచ్‌లన్నీ కట్టి పడెయ్యడం ఒకటైతే... ఇదే నెలలో ప్రపంచ కప్ మొదలవనుండటం మరో అంశంగా చెప్పుకోవచ్చు. ఐతే... ఐపీఎల్ ముగుస్తున్న టైంలో అసలు ఐపీఎల్ జట్టు ఎలా ఉండాలన్నదానిపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా లెక్కలేస్తున్నారు. టీంఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. చిత్రమేంటంటే ఈ జట్టు దాదాపు అనిల్‌కుంబ్లే ప్రకటించిన జట్టులాగే ఉంది. వీరూ తన టీంలో టీంఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ప్రస్తుత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు చోటు ఇవ్వలేదు. ఇంకా చిత్రమేంటంటే... ఫైనల్‌కు చేరిన ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోహ్లీ కెప్టెన్సీ లోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లలో ఏ ఒక్క ప్లేయర్‌నీ వీళ్లు తీసుకోలేదు. ఇది ఎవరూ ఊహించని జట్టు అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఎంపిక ఎందుకు చేసిందీ వీరూ క్లారిటీ ఇచ్చాడు.

ఆటగాళ్ల రికార్డుల చరిత్రను లెక్కలోకి తీసుకోలేదు వీరూ. ఈ సంవత్సరం ఎలా అడారో అది మాత్రమే గమనించి తన టీంను ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ ఏడాది తనను ఎక్కువగా ఆకట్టుకున్న ప్లేయర్ రిషభ్‌ పంత్‌ అని వివరించాడు. వీరేంద్ర సెహ్వాగ్ తన జట్టులో ఆస్ట్రేలియా ప్లేయర్, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌, రసెల్‌, హార్దిక్‌ పాండ్య బాగా ఆడుతున్నారనీ లెక్కలేశాడు. అందువల్ల వాళ్లను తీసుకున్నట్లు తెలిపాడు.

బౌలింగ్‌‌లో బెస్ట్ బౌలర్లుగా బుమ్రా, రబాడా చక్కటి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారన్న వీరూ... వాళ్లను తీసుకున్నట్లు తెలిపాడు. స్పిన్‌ విషయంలో యువ స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, శ్రేయస్‌ గోపాల్ ఈ సంవత్సరం... బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతున్నారని అన్నాడు.

కోహ్లీ, డివిలియర్స్‌ ఈ సీజన్‌లో సరిగా ఆడట్లేదనీ, అందుకే వాళ్లను పక్కన పెట్టానని అన్నాడు. వీరూ టీంలో ఇద్దరు వికెట్‌ కీపర్లు, నలుగురు ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌, ఇద్దరు ఆల్‌ రౌండర్లు, ఇద్దరు ప్రధాన పేస్లరు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. మొత్తానికి ఎవరూ ఊహించని జట్టును ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడూ వీరూ.

వీరేంద్ర సెహ్వాగ్‌ 2019 బెస్ట్ ఐపీఎల్ టీం : డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌స్టో, కేఎల్‌ రాహుల్, రిషభ్‌పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అండ్రూ రసెల్‌, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ చాహర్‌, కగిసో రబాడా, జస్ప్రీత్‌ బుమ్రా.

 

ఇవి కూడా చదవండి :రవి ప్రకాశ్ ఎక్కడ..? గాలిస్తున్న పోలీసులు... సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్... నో క్లూ...

ఏపీలో కింగా, కింగ్ మేకరా... నేడు తేల్చనున్న పవన్ కళ్యాణ్...

IPL Final Match : ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమైన CSK, MI... జోరుగా బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందా

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?
First published: May 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading