Mumbai Indians vs Chennai Super Kings | IPL 2019 Final :
ఐపీఎల్ 2019 టైటిల్ ను ముంబై ఇండియన్స్ నాలుగో సారి సొంతం చేసుకుంది. చివరి వరకూ ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో చివరి బంతి వరకూ టెన్షన్ కొనసాగిన మ్యాచ్ లో చివరి బంతిలో మలింగా మ్యాజిక్ చేయడంతో ముంబై టైటిల్ విజేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే తొలి వికెట్ భాగస్వామ్యానికి 3 ఓవర్లలో 33 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ డుప్లెసిస్ ఔటవడంతో, స్కోరు బోర్డు నెమ్మదించింది. షేన్ వాట్సన్ నిలకడగా ఆడుతున్నప్పటికీ రైనా, రాయుడు వెంటవెంటనే ఔట్ అవడంతో 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాయుడు కేవలం 1 పరుగు చేసి ఔట్ అవ్వగా, నాటకీయ పరిణామాల మధ్య రనౌటవడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్రేవోతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. 15 ఓవర్లో మలింగా వేసిన ఓవర్లో షేన్ వాట్సన్ ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. అంతే కాదు 17వ ఓవర్లో వాట్సన్ ఏకంగా మూడు సిక్సర్లు బాదడంతో చెన్నై స్కోరు బోర్డు వేగంగా కదిలింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా,
చెన్నై బౌలర్ల ధాటికి ముంబై చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని బ్యాటింగ్ చేసుకుంది. తొలి 4 ఓవర్లలో డికాక్ సిక్సులతో విరుచుకుపడటంతో నాలుగు ఓవర్లలోనే 45 పరుగులు చేసింది. అయితే డికాక్ ఔట్ కావడంతో ముంబై వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ బంతికే రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులకే ఔట్ అవడంతో ముంబై కష్టాలు మొదలయ్యాయి. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఎస్ఎ యాదవ్ 15 పరుగులు చేసి ఔట్ అవగా, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కేవలం పొలార్డ్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. పొలార్డ్ తో హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేసినప్పటికీ భారీ స్కోరు నిర్మించలేకపోయారు. పాండ్యా వెనుతిరగడంతో, తరువాత బ్యాటింగ్ కు వచ్చిన చహార్, మెక్ క్లెన్‌ఘన్ పరుగులేమి చేయకుండానే ఔటయ్యారు.
అటు చెన్నై బౌలర్లలో చహార్ 3 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీసి ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.