• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL DATES CONFIRMED SCHEDULE CLASHED WITH CPL BCCI TALKS WITH CRICKET WEST INDIES JNK

IPL 2021 : ఐపీఎల్ డేట్స్ కన్ఫార్మ్.. అడ్డొస్తున్న సీపీఎల్.. విండీస్ బోర్డుతో బీసీసీఐ చర్చలు

IPL 2021 : ఐపీఎల్ డేట్స్ కన్ఫార్మ్.. అడ్డొస్తున్న సీపీఎల్.. విండీస్ బోర్డుతో బీసీసీఐ చర్చలు

విండీస్ బోర్డును బుజ్జగిస్తున్న బీసీసీఐ

ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినా.. లీగ్ నిర్వహణకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌తో కరేబియన్ ప్రీమియర్ లీగ్ క్లాష్ అవుతుండటంతో విండీస్ బోర్డుతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నది.

  • Share this:
    కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021ని (IPL 2021) యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ (BCCI) శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18న ఐపీఎల్ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. కేవలం మూడు వారాల్లో ఐపీఎల్ రెండో ఫేజ్ ముగించాలని.. అక్టోబర్ 10న ఫైనల్ నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే వేదిక, తేదీలు ఖరారు అయినా ఐపీఎల్‌కు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. లీగ్ తేదీల దగ్గర నుంచి విదేశీ ఆటగాళ్ల గైర్హాజరు వరకు బీసీసీఐ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. లీగ్‌కు మూడున్నర నెలల సమయం మాత్రమే ఉండటంతో వీటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించే పనిలో పడింది. ఐపీఎల్‌కు మొదటి అడ్డంకి కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) రూపంలో ఎదురవుతున్నది. త్వరలోనే ఈ లీగ్ నిర్వహించనున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే లీగ్ షెడ్యూల్ మాత్రం ప్రకటించలేదు. గత సీజన్ షెడ్యూల్ బట్టి అగస్టు చివరి వారంలో మొదలై సెప్టెంబర్ చివరి వారం వరకు సీపీఎల్ జరిగే అవకాశం ఉన్నది. ఆ షెడ్యూల్ కచ్చితంగా ఐపీఎల్‌తో క్లాష్ అయ్యే అవకాశం ఉన్నది. దీంతో విండీస్ బోర్డుతో (Cricket West Indies) చర్చలు జరపడానికి బీసీసీఐ సిద్దపడినట్లు తెలుస్తున్నది.

    సీపీఎల్‌ను వారం రోజులు ముందుకు జరపడం వల్ల ఆ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లు తిరిగి యూఏఈ చేరుకొని ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంటుందని.. అందుకే విండీస్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్‌లో కనుక మార్పు లేకపోతే పలువురు విండీస్ ఆటగాళ్లు కూడా తొలి వారంలో ఐపీఎల్ మిస్అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు సీపీఎల్‌ను కాస్త ముందుకు జరపడం వల్ల ఆటగాళ్లకు క్వారంటైన్ పిరియడ్ లభించే అవకాశం ఉన్నది. టీమ్ ఇండియా ఆటగాళ్లు సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాండ్‌లో ఉంటారు. వాళ్లకు బయోబబుల్‌లోనే ఉండటం వల్ల నేరుగా యూఏఈ వచ్చి ఆయా ఫ్రాంచైజీలతో చేరతారు. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు కూడా మూడు రోజుల క్వారంటైన్ పిరియడ్ లభించాలంటే షెడ్యూల్‌ను కాస్త ముందుకు జరపాల్సి ఉంటుంది. అందుకే బీసీసీఐ మంతనాలు సాగిస్తున్నది.

    మరోవైపు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం అవుతుండటంతో వారి స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవడానికి విధివిధానాలు రూపొందించాలని ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నాయి. ప్లేయర్ రిప్లేస్ మెంట్ పాలసీ వెంటనే రూపొందిస్తే తాము ఆయా ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్లను తీసుకుంటామని చెబుతున్నాయి. మరో మూడు నెలల సమయం ఉండటంతో త్వరంగా ఆ పాలసీని రూపొందించాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి.
    Published by:John Naveen Kora
    First published: