IPL Auction 2023 Live Updates : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. కొచ్చి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ స్యామ్ కరణ్ (Sam Currun) రికార్డు ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఏకంగా రూ. 18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా స్యామ్ కరణ్ నిలిచాడు. గతంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుది. అయితే తాజాగా ఈ రికార్డును స్యామ్ కరణ్ బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్ గ్రీన్ పంట కూడా పండింది. కెమెరూన్ గ్రీన్ ను ఏకంగా 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గ్రీన్ కోసం చివరి వరకు పోరాడింది. అయితే చివరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.
వేలంలో స్పెషలిస్టు బ్యాటర్ల లిస్టులో వేలంలోకి వచ్చిన హ్యారీ బ్రూక్ (Harry Brook) కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్ (Rajastan Royals) జట్లు పోటీ పడ్డాయి. రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి కోసం తొలి బిడ్ ను రాజస్తాన్ రాయల్స్ పాడింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా రంగంలోకి దిగింది. రూ. 5 కోట్లకు చేరుకున్న తర్వాత ఆర్సీబీ తప్పుకుంది. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్.. దూకుడు కనబర్చింది. చూస్తుండగానే వేలం రూ. 10 కోట్లు దాటేసింది. 13.25 కోట్లకు చేరుకున్న తర్వాత రాజస్తాన్ రాయల్స్ వద్ద ఉన్న మనీ పర్సు మొత్తం ఖర్చు కావడంతో ఆ జట్టు వేలం నుంచి తప్పుకుంది. చివరకు 13.25 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.
బ్రూక్స్ ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టి20 ప్రపంచకప్ ముందు జరిగిన టి20 సిరీస్ లో పాకిస్తాన్ పై చెలరేగిపోయాడు. టి20 ప్రపంచకప్ లో కూాడా మంచి ప్రదర్శన చేశాడు. ఇక ఇటీవలె పాకిస్తాన్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో మూడు సెంచరీలతో రెచ్చిపోయాడు. దంచి కొట్టడంలో బ్రూక్ శైలే వేరు. ఇతడిని సొంతం చేసుకోవడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ మరింత బలంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2023 Mini Auction, Punjab kings