ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2022 మెగా వేలం బెంగళూరు వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం తొలి రోజు వేలంలోకి 97 మంది ప్లేయర్ల రాగా... 74 మంది ప్లేయర్లను 10 జట్లు సొంతం చేసుకున్నాయి. గెలుపు గుర్రాలు కోసం తగ్గేదే లే అన్నట్టు పోరాడాయ్ అన్నీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు.ఈసారి రెండు కొత్తవాటితో కలిపి మొత్తం పది జట్లు ఆటగాళ్ల కొనుగోళ్లకు పోటీపడ్డాయి. ఐపీఎల్ 2022 వేలంలో కొందరి ఆటగాళ్లకు ఊహించని ధర పలకగా.. మరికొందరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర పలికింది. ఇక కొందరు స్టార్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు కాగా.. అనామక ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఏదేమైనా వేలం మాత్రం రసవత్తరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. మరికాసేపట్లో రెండో రోజు వేలం ఆరంభం కానుండగా... దాదాపు మరో 500 మంది ప్లేయర్లను వేలంలో పాడాల్సి ఉంది.
ఇక, మైదానంలో తన జట్టు ప్లేయర్లను ఎంకరేజ్ చేయడంలో కానీ... వేలంలో ప్లేయర్లను కొనడంలోకానీ ఎప్పుడూ ఆసక్తి కనబరిచే బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ (PBKS) కో ఓనర్ ప్రతీ జింతా (Preity Zinta) ఈసారి వేలంలో పాల్గొనలేదు. వ్యక్తిగత కారణాలతో ఆమె బెంగళూరు వేదికగా జరుగుతున్న వేలానికి దూరంగా ఉంది. అయితేనేం టీవీ ద్వారా వేలం ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంది.
Good to see Mumbai Indians are Covid compliant at the IPL auction table? Must confess Nita Ambani has pretty eyes ? #tataipl #iplauction @IPL #ting pic.twitter.com/Y1MLbCkSeg
— Preity G Zinta (@realpreityzinta) February 12, 2022
అయితే, తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ముంబై ఇండియన్స్ (MI) మేనేజ్‌మెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. తొలి రోజు వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్లు నీతా అంబాని, ఆమె కుమారుడు ఆకాశ్‌లతో పాటు కోచ్‌లు మహేళ జయవర్థనే, జహీర్ ఖాన్‌లు హాజరయ్యారు. వీరు కోవిడ్-19 ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ వేలంలో పాల్గొన్నారు. దీనిపైనే ప్రీతి జింతా ట్వీట్ చేసింది. “కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ముంబై ఇండియన్స్ ఆక్షన్ టేబుల్ దగ్గర అందరికీ ఆదర్శంగా నిలిచారు. నీతా అంబాని కళ్లు చాలా అందంగా ఉన్నాయి” అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ప్రీతిజింతా తన భర్త జీన్ గుడెనఫ్‌తో కలిసి అమెరికాలో ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో ప్రీతిజింతా సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. ఇంట్లో నాలుగు నెలల కవల పిల్లలను వదిలేసి, బెంగళూరుకు ట్రావెల్ చేయలేనని స్పష్టం చేశారు. ఐపీఎల్ మెగా వేలం ఈవెంట్‌ను మిస్ అవుతున్నానని చెప్పారు. వేలంలో పంజాబ్ శిఖర్ ధావన్, షారుఖ్ ఖాన్, బెయిర్ స్టో, కగిసో రబడ వంటి స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.