ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2022 వేలంలో భాగంగా తొలి రోజు జరిగి ఆక్షన్లో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వేలం మధ్యలో చీఫ్ ఆక్షనీర్ హ్యూజ్ ఎడ్మీడ్స్ (Hugh Edmeades) ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. లో బీపీ కారణంగా ఆయన కళ్లు తిరిగి పడిపోగా... వెంటనే అక్కడకు చేరుకున్న వైద్య బృందం అతడిని తమ పర్యవేక్షణలో ఉంచుకుంది. వేలం ఆగిపోకుండా ఉండటానికి విఖ్యాత కామెంటేటర్ చారు శర్మ (Charu Sharma)తో మిగిలిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజాగా తన ఆరోగ్యంపై ఎడ్మీడ్స్ ఒక వీడియో ద్వారా సందేశం ఇచ్చాడు. తనను క్షమించాల్సిందిగా బీసీసీఐ (BCCI), టీమ్లను, ప్లేయర్లను ఎడ్మడీస్ కోరాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగున్నట్లు ఎడ్మీడీస్ తెలిపారు. వేలం మధ్యలో తప్పుకున్నందుకు నిరాశగా ఉందని... అయితే చారు శర్మ వేలాన్ని నడుపుతున్న విధానం చాలా బాగున్నట్లు ఆయన పేర్కొన్నారు. తక్కువ టైమ్లో వేలానికి రెడీ అయిన చారు శర్మ దైర్యాన్ని అతడు మెచ్చుకున్నారు. ఇప్పటికైతే విశ్రాంతి తీసుకుంటానని... తన బదులు చారు శర్మ వేలాన్ని నిర్వహిస్తారని... ఆటగాళ్లకు మంచి ధర పలికేలా చారు శర్మ వేలం పాడతాడని భావిస్తున్నట్లు ఎడ్మడీస్ పేర్కొన్నారు. దానితో పాటు తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. ఎడ్మీడ్స్ వీడియో నిమిషంపైనే ఉంది.
Mr. Hugh Edmeades - the IPL Auctioneer - is fine now ? and has a message for all. #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/U7uzt6PIMw
— IndianPremierLeague (@IPL) February 13, 2022
IPL Auction: అన్ని కోట్లా..! రెండో రోజు వేలంలో భారీ ధర పలికిన పవర్ హిట్టర్లు వీరే...
ఐపీఎల్ తొలి రోజు వేలం సందర్భంగా అపసృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం మధ్యలో కుప్పకూలాడు. దాంతో వేలం నిలిచిపోయింది. శ్రీలంక ఆల్రౌండర్ హసరంగను వేలం పాడుతుండగా... ఉన్నట్లుండి హ్యూ ఎడ్మీడ్ కింద పడిపోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత కాసేటికి ఆయన కోలుకున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో తిరిగి వేలానికి రాలేదు. బెడ్ రెస్ట్ తీసుకున్నారు. హ్యూఎడ్మీడ్స్ అస్వస్థతకు గురవడంతో ఆయన స్థానంలో చారు శర్మ వేలం నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం మొదలైన ఐపీఎల్ మెగా వేలం.. ఇవాళ్టితో ముగుస్తుంది.
IPL Auction 2022: అప్పుడేమో రూ.9.20 కోట్లు.. ఇప్పుడు రూ. 90 లక్షలు.. పాపం అతడు ఎవరంటే..
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలిరోజున జాబితాలో మొత్తం 161 మంది ఆటగాళ్లున్నా, కేవలం 97 మంది మాత్రమే వేలంలోకి వచ్చారు. అందులో 74 మంది ఆటగాళ్లే అమ్ముడుపోయారు. 23 మంది ప్లేయర్లను ఎవరూ కొనలేదు. ఐపీఎల్ 2022 వేలంలో కొందరి ఆటగాళ్లకు ఊహించని ధర పలకగా.. మరికొందరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర పలికింది. ఇక కొందరు స్టార్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు కాగా.. అనామక ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఏదేమైనా వేలం మాత్రం రసవత్తరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL, IPL 2022, IPL Auction 2022