ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 వేలంలోకి వచ్చినా కొందరు ఆటగాళ్లు మళ్లీ సొంత గూటికే చేరుకున్నారు. రీటెయిన్ పాలసీ ద్వారా కేవలం నలుగురు ఆటగాళ్లనే ఉంచుకోవడంతో మనసుకు నచ్చకున్నా కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలోకి విడుదల చేశాయి. అయితే వీరి మీద ఉన్న ప్రేమో లేక బాగా ఆడతారన్న నమ్మకమో తెలిదు కానీ.. తమ పాత ఆటగాళ్లలో కొందర్ని మళ్లీ సొంతం చేసుకున్నాయి. దాంతో ప్లేయర్లు తమ సొంత గూటికి చేరుకుని స్వాంతన పొందారు. అలా సొంత గూటికి చేరుకున్న ఆటగాళ్లలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
IPL Auction 2022: శ్రేయస్‌ను దాటేసిన ఇషాన్ కిషన్... కొద్దిలో ఐపీఎల్ వేలం రికార్డు మిస్
ఇషాన్ కిషన్ (Ishan kishan)
ఈ వేలంలోకి రాకముందు ఇతడు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. రీటెయిన్లో ఇషాన్‌ను ఉంచుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు. అయితేనేం ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ముంబై హైదరాబాద్‌తో పోటీ పడీ మరీ ఇషాన్‌ను దక్కించుకుంది. ఇందుకోసం ముంబై రూ.15.25 కోట్లను వెచ్చించింది.
IPL Auction 2022: వేలంలో ఖాతా తెరిచిన హైదరాబాద్.. ఏ ఆటగాడిని కొనిందంటే!
దీపక్ చహర్ (Deepak char)
ఈ జాబితాలో దీపక్ చహర్ కూడా ఉన్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఇతడు మెగా వేలంలోకి వచ్చాడు. గతంలో ఇతడిని చెన్నై రూ. 40 లక్షలకు సొంతం చేసుకోగా... ఈసారి మాత్రం బాగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. వేలంలో చెన్నై రూ.14 కోట్లను పోసి దీపక్‌ను సొంత గూటికి తెచ్చుకుంది. అంతేకాదు దీపక్‌తో పాటు చెన్నై తన పాత ప్లేయర్లలో చాలా మందిని మళ్లీ కొనుగోలు చేసింది. అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు), రాబిన్ ఉతప్ప (రూ. 2 కోట్లు), డ్వేన్ బ్రావో (రూ.4.4 కోట్లు) ఉన్నారు.
వీరితో పాటు గతంలో బెంగళూరుకు ఆడిన హర్షల్ పటేల్, హసరంగలను ఆర్సీబీ మళ్లీ కొనుగోలు చేసింది. ప్యాట్ కమిన్స్‌ను తక్కువ ధరకు కేకేఆర్ మళ్లీ సొంతం చేసుకుంది. నటరాజన్, భువనేశ్వర్ కుమార్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
IPL Auction 2022: ఏందీ హసరంగా ఇది.. మరీ అంత ధరనా!
గత ఐపీఎల్ (IPL) సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్న హర్షల్ పటేల్ వేలంలో భారీ ధర పలికాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతడిని ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. హర్షల్ కోసం హైదరాబాద్ కూడా పోటీ పడింది. దాంతో రేటు బాగా పెరిగింది. చివరకు 10.75 కోట్లకు హర్షల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. 2022 వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్‌గా హర్షల్ నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2022, IPL Auction 2022