ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా బాలీవుడ్ బాద్షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్ (Shahrukh khan) సంతానం ఆర్యన్ ఖాన్ (aryan khan), సుహానా ఖాన్ (Suhana khan) నిలిచారు. ఎప్పుడూ వేలంలో ఉండే షారుఖ్ ఖాన్ ఈసారి వేలానికి దూరం కాగా.. అతడి స్థానంలో ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ హాజరయ్యారు. కేకేఆర్ టీమ్‌తో కలిసి కూర్చున్న వీరి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ వేలం గురించి మాట్లాడుకుంటున్న ఒక ఫోటోనూ కేకేఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. డ్రగ్స్ కేసు (Drug Case) లో గతేడాది ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులకు పైగా జైలు జీవితం గడిపిన అతడు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. వేలంలో కేకేఆర్ ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్, కమిన్స్‌లను సొంతం చేసుకుంది.
IPL Auction 2022: వార్నర్ ధర పడిపాయే.. చీప్‌గా కొట్టేసిన పాత ఫ్రాంచైజీ!
పాపులారిటీ ఉన్నా అంతంతే..
ఐపీఎల్ (IPL)లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ మెగా వేలంలో భారీ ధర పలకలేకపోయాడు. మార్కీ ప్లేయర్ల విభాగంలో చివరగా వచ్చిన డేవిడ్ వార్నర్‌ను తన పాత ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) చీప్‌గా కొట్టేసింది. తొలుత అతడిని ఢిల్లీ పాడగా.. అనంతరం పోటీలోకి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చింది. దాంతో వార్నర్ ధర ఊపందుకుంది. వెంట వెంటనే వార్నర్ ధర రూ. 5 కోట్లను దాటగా అక్కడి నుంచి నెమ్మదించింది. మధ్యలో ముంబై కూడా వార్నర్ కోసం ప్రయత్నించడంతో రూ. 6 కోట్లు దాటింది. చివరకు వార్నర్‌ను 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
IPL 2022 Auction : ఈ భారత బౌలర్లు గెలుపు గుర్రాలు.. వేలంలో వీళ్లకు తిరుగుండదు..
వేలం హైలెట్స్..
నితీష్ రాణాను తిరిగి కోల్‌కతా జట్టే కొనుగోలు చేసింది. రూ.8 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. గతంలో చెన్నై జట్టులో ఉన్న వెస్టిండీస్ (West Indies) ఆల్‌రౌండర్ బ్రావోను తిరిగే అదే జట్టు కొనుగోలు చేసింది. రూ.4.40 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smit) కూడా వేలలో అమ్ముడుపోలేదు. అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరున్న సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. రూ.2 కోట్ల కనీస ధర ఉన్న రైనాను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aryan Khan, IPL, IPL 2022, IPL Auction 2022, Shahrukh khan