ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఫ్రాంచైజీలన్నీ ఆల్ రౌండర్లు, బౌలర్లపై ఎక్కువ దృష్టి పెట్టాయ్. ఇక ఈ మినీ వేలంలో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడుకు చెందిన బ్యాట్స్‌మన్ షారుక్‌ఖాన్‌ను రూ. 5.25 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేకేఆర్ సహా యజమాని షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న ఈ ఆటగాడి ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా పంజాబ్ కింగ్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ ఆటగాడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీపడటం విశేషం. అయితే క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే ఆర్యన్ ఖాన్ వైపు తిరిగిన ప్రీతి జింటా.. మేము మీ నాన్నను సొంతం చేసుకున్నాం ఆర్యన్ అంటూ నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోపై వినూత్న రీతిలో స్పందించారు. అయ్యో షారుక్‌ఖాన్ ఇప్పుడే పంజాబ్ కింగ్స్‌కు సొంతం అయ్యాడా.. షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Preity zinta to Aryan khan : we got Shah Rukh ???? #IPLAuction2021 pic.twitter.com/xdvCddxrz7
— ???? ʘ‿ʘ (@lostshruu) February 18, 2021
.@iamsrk HaHaHa ....my Aryan is smiling hearing Shah Rukh Khan for the bidding....my baby...he will tease you a lot over this tonight for sure Papa, get ready ??#IPLAuction2021 #AryanKhan pic.twitter.com/jNEfPzVVSF
— ♡ Sнαн ᏦᎥ Ᏸ?ω? ♡ ? ??? ღ (@JacyKhan) February 18, 2021
అయితే, వేలం మధ్యలో దొరికిన విరామంలో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతి జింటా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆర్యన్‌తో పాటు కేకేఆర్ సహా యజమాని జూహీచావ్లా కూతురు జాహ్నవి మెహతా కూడా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు ఆర్యన్‌ను చూసిన చాలా మంది షారుక్ అభిమానులు.. అతడు అచ్చూ తమ హీరోలాగే ఉన్నాడని మురిసిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, T20 Auction 2021