IPL 2021 వేలం హాట్ హాట్ గా సాగుతోంది. విదేశీ ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నాయి. క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడు క్రిస్ మోరిస్ ఒక్కడే. క్రిస్ మోరిస్ కోసం ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. బేస్ ప్రైస్ రూ.75 లక్షలు అయితే అతడిని ఏకంగా రూ.16.25 కోట్లు ఇచ్చి కొనుక్కుంది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2021లోనే కాదు. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర. గతంలో యువరాజ్ సింగ్ రూ.16 కోట్లు అత్యధిక ధర. దీన్ని క్రిస్ మోరిస్ బ్రేక్ చేశాడు. ఇక భారత ప్లేయర్లలో ఇప్పటివరకు క్రిష్ణప్ప గౌతమ్ ఎక్కువ ధరకు అమ్ముడుబోయాడు. ఈ కర్ణాటక ప్లేయర్ ను రూ.9.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మరోవైపు తమిళనాడు యంగ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ కు కాసుల పంట పండింది. ఈ యంగ్ ఫినిషర్ ను పంజాబ్ కింగ్స్ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు.. ఐపీఎల్ 2021 సీజన్ వేలం జరుగుతున్న తీరుపై ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాజా వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లవైపు మొగ్గు చూపుతుండటంతో వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే క్రిస్ మోరీస్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. జై రిచర్డ్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు తీసుకుంది. ఇక ఆల్‌రౌండర్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు భారీ ధరకు అమ్ముడుపోయారు.
ఇక రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సామ్ బిల్లింగ్స్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో అతనికి ఈ సారి నిరాశే ఎదురైంది. దీంతో అతను ట్విటర్ వేదికగా వేలం జరుగుతున్న తీరుపై తనదైన శైలిలో స్పందించాడు. బౌలర్‌గా ఎందుకు కాలేదని తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతుందని ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్ వేలం చూసి నా గర్ల్ ఫ్రెండ్ సారా.. నువ్వు బౌలర్ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తుంది'అని బిల్లింగ్స్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు స్పందిస్తూ.. సెకండ్ రౌండ్‌లో అవకాశం వస్తుందని ధైర్యం చెబుతున్నారు.
My girlfriend Sarah just turns to me and goes... ‘why aren’t you a bowler?’ ?
— Sam Billings (@sambillings) February 18, 2021
187 టీ20 మ్యాచ్‌లు ఆడిన సామ్ బిల్లింగ్స్ 6527 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 131.01గా ఉంది. 2018 ఐపీఎల్ వేలంలో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనగోలు చేసింది. అంతకుమందు ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు అతను ప్రాతినిధ్యం వహించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, T20 Auction 2021