IPL 2021 Auction Live: క్రిష్ణప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు, షారుఖ్ ఖాన్ కు రూ.5.25 కోట్లు.. హాట్ హాట్ గా వేలం

IPL 2021 Auction Live Updates: IPL 2021 వేలం హాట్ హాట్ గా సాగుతోంది. విదేశీ ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నాయి. క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మ్యాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.

  • News18 Telugu
  • | February 18, 2021, 17:39 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 YEARS AGO

    AUTO-REFRESH

    Highlights

    20:18 (IST)

    అర్జున్ టెండూల్కర్ ను రూ. 20 లక్షలకు దక్కించుకుంది ముంబై ఇండియన్స్. మరే, ఇతర ఫ్రాంచైజీ సచిన్ తనయుడిపై ఆసక్తి చూపలేదు.

    19:58 (IST)

    టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

    19:55 (IST)

    కేదార్ జాదవ్ ను రూ.2 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.


    19:52 (IST)

    ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ సామ్ బిల్లింగ్స్ ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.


    19:45 (IST)

    ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను రూ.20 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.

    19:40 (IST)

    ఆసీస్ ఆల్ రౌండర్ డేనియల్ క్రిస్టియన్ ను భారీ మొత్తంలో ఆర్సీబీ దక్కించుకుంది. ఈ ఆటగాణ్ని రూ.4.8 కోట్లుకు వెచ్చించింది కోహ్లీసేన.

    IPL 2021 వేలం హాట్ హాట్ గా సాగుతోంది. విదేశీ ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నాయి. క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడు క్రిస్ మోరిస్ ఒక్కడే. క్రిస్ మోరిస్ కోసం ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. బేస్ ప్రైస్ రూ.75 లక్షలు అయితే అతడిని ఏకంగా రూ.16.25 కోట్లు ఇచ్చి కొనుక్కుంది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2021లోనే కాదు. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర. గతంలో యువరాజ్ సింగ్ రూ.16 కోట్లు అత్యధిక ధర. దీన్ని క్రిస్ మోరిస్ బ్రేక్ చేశాడు.

    ఇక భారత ప్లేయర్లలో ఇప్పటివరకు క్రిష్ణప్ప గౌతమ్ ఎక్కువ ధరకు అమ్ముడుబోయాడు. ఈ కర్ణాటక ప్లేయర్ ‌ను రూ.9.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మరోవైపు తమిళనాడు యంగ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ కు కాసుల పంట పండింది. ఈ యంగ్ ఫినిషర్ ను పంజాబ్ కింగ్స్ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది.

    ఇక మ్యాక్స్‌వెల్ ఓపెనింగ్ బిడ్ రూ.2 కోట్లు.. అయితే, అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాక్స్‌వెల్ కోసం చెన్న సూపర్ కింగ్స్, ఆర్సీబీ పోటీపడ్డాయి. కానీ, ఆర్సీబీ పెద్ద మొత్తం చెల్లించి మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకుంది. ఇప్పటికే స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేపిటల్స్ రూ.2.25 కోట్లకు కొనుగోలు చేసింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.  ఇక కేదార్ జాదవ్‌ను వేలంలో ఎవరూ కొనలేదు.

    అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

    క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)

    మ్యాక్స్‌వెల్ రూ.14.25 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

    జే రిచర్డ్‌సన్ రూ.14 కోట్లు (పంజాబ్ కింగ్స్)

    క్రిష్ణప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)

    మొయిన్ అలీ రూ.7 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)

    షారుఖ్ ఖాన్ రూ.5.25 కోట్లు ( పంజాబ్ కింగ్స్)

    శివమ్ దూబే రూ.4.4 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)

    ఆడమ్ మైల్న్ రూ.3.20 కోట్లు (ముంబై ఇండియన్స్)

    షకీబ్ అల్ హసన్ రూ.3.20 కోట్లు (కోల్ కతా నైట్ రైడర్స్)

    స్టీవ్ స్మిత్ రూ.2.20 కోట్లు (ఢిల్లీ కేపిటల్స్)

    డేవిడ్ మలన్ రూ.1.50 కోట్లు (పంజాబ్ కింగ్స్)


    అమ్ముడుపోని ప్లేయర్లు

    కేదార్ జాదవ్

    హనుమవిహారి

    ఆరోన్ ఫించ్

    ఎవిన్ లూయిస్

    జాసన్ రాయ్

    అలెక్స్ హేల్స్

    కరణ్ నాయర్

    అలెక్స్ కేరీ

    సామ్ బిల్లింగ్

    కుశల్ పెరీరా

    164 భారతీయ ఆటగాళ్లు, 125 విదేశీయులు వేలంలో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కూడా తొలి సారి వేలంలోకి వచ్చాడు. అతడిని ఏ టీమ్ దక్కించుకుంటుందో చూడాలి.