IPL Auction 2021 : IPL 2021 వేలం హాట్ హాట్ గా సాగింది. ఈ సారి ఆల్ రౌండర్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాయ్ ఐపీఎల్ ఫ్రాంచైజీలు. విదేశీ ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో వెచ్చించాయ్. . సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ తీసుకోవడంతో ఈ మినీ ఆక్షన్‌కు తెరపడింది. 292 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా..57 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఈ మినీ వేలంలో 8 ఫ్రాంచైజీలు రూ. 145 కోట్ల 30లక్షలను ఖర్చు చేశాయి. అయితే కొంతమంది స్టార్ క్రికెటర్లకు ఈసారి నిరాశే ఎదురైంది. ఒకసారి ఆ లిస్ట్ పై లుక్కెద్దాం.
అమ్ముడు పోని స్టార్ ప్లేయర్స్..
1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)
2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)
3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
5. హనుమ విహారీ(భారత్)
6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)
7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)
8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)
9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)
10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)
11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)
12. వరుణ్ ఆరోన్ (భారత్)
13. మోహిత్ శర్మ(భారత్)
14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)
15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)
16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, T20 Auction 2021