హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL Auction 2021 : మినీ వేలం రేసులో 14 మంది తెలుగు కుర్రాళ్లు.. గోల్డెన్ ఛాన్స్ ఎవరి సొంతం..

IPL Auction 2021 : మినీ వేలం రేసులో 14 మంది తెలుగు కుర్రాళ్లు.. గోల్డెన్ ఛాన్స్ ఎవరి సొంతం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IPL Auction 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 వేలానికి రంగం సిద్దమైంది. ఐపీఎల్ అంటేనే కాసుల ఆట. అనామక ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోంది. అందుకే ఐపీఎల్‌లో చోటు దక్కించుకునేందుకు అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు పాటు లోకల్ ఆటగాళ్లు కూడా పోటీ పడుతుంటారు.

ఇంకా చదవండి ...

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 వేలానికి రంగం సిద్దమైంది. ఐపీఎల్ అంటేనే కాసుల ఆట. అనామక ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోంది. అందుకే ఐపీఎల్‌లో చోటు దక్కించుకునేందుకు అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు పాటు లోకల్ ఆటగాళ్లు కూడా పోటీ పడుతుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఐపీఎల్ వేల జరుగుతోంది. మరికాసేపట్లో వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎప్పట్లాగే హార్డ్ హిట్టర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం ఖాయమే. ఈ నేపథ్యంలోనే మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ వేలంలో తెలుగు రాష్టాల నుంచి కూడా ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీమిండియా ప్లేయర్ హనుమ విహారితో సహా 14 మంది యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. గత సీజన్‌లో ఎవ్వరూ తీసుకోని విహారి ఒకటిన్నర కోట్ల బేస్‌ప్రైజ్‌తో పోటీలో నిలిచాడు. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడని ఆల్‌రౌండర్ బావనక సందీప్‌తో పాటు హైదరాబాద్ నుంచి మిలింద్, యుధ్‌వీర్, అజయ్ దేవ్‌గౌడ్, టి, రవితేజ, తనయ్, తిలక్, భగత్ వర్మ రూ.20 లక్షల బేస్‌ప్రైజ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

వీరంతా ఆల్‌రౌండర్లే. ఇదే బేస్‌ప్రైజ్‌తో ఆంధ్ర నుంచి కీపర్ కేఎస్ భరత్, పేసర్లు సీహెచ్ స్టీఫెన్, పృథ్వీరాజ్, హరిశంకర్ రెడ్డి, ఆల్‌రౌండర్ షోయబ్ కూడా తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. గత కొన్ని సీజన్లుగా తెలుగు రాష్ట్రాల ఆటగాళ్ల ప్రాతినిధ్యం తగ్గిన నేపథ్యంలో ఈసారైన ఎక్కువ మందికి అవకాశం దక్కాలని ఇరు రాష్ట్రాల అభిమానులు కోరుకుంటున్నారు. అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ మినహా.. ఐపీఎల్‌లో మరో చెప్పుకోదగ్గ ప్లేయర్ లేడు. ఈ సారైనా తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్స్ ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.

First published:

Tags: IPL 2021, T20 Auction 2021

ఉత్తమ కథలు