హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL Auction 2021 : అర్జున్ టెండూల్కర్ పై పేలుతున్న జోకులు..రాహుల్ గాంధీని కూడా..

IPL Auction 2021 : అర్జున్ టెండూల్కర్ పై పేలుతున్న జోకులు..రాహుల్ గాంధీని కూడా..

రూ.20 లక్షలు పెట్టి ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ టెండుల్కర్‌ను కొనుక్కుంది.

రూ.20 లక్షలు పెట్టి ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ టెండుల్కర్‌ను కొనుక్కుంది.

IPL Auction 2021 : క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజంగా కోట్లాది క్రీడాభిమానుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్...నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.

  క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజంగా కోట్లాది క్రీడాభిమానుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్...నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్ పై కొందరు ట్రోలింగ్ చేస్తుంటే..మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షలతో అర్జున్ టెండూల్కర్ ను దక్కించుకుంది ముంబై ఇండియన్స్. అయితే, వేలం జరిగే ముందు అర్జున్ పై విపరితీంగా ట్రోలింగ్ చేశారు. సచిన్ కొడుకు అవ్వడం వల్ల అతనికి ఈజీగా ఐపీఎల్ లో చోటు దక్కిందని..ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ వేలంకు ముందే సచిన్ కొడుక్కి ముంబై జెర్సీ దక్కిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏ రూల్ ప్రకారం అర్జున్ ను ముంబై జట్టులోకి తీసుకున్నారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో బెటర్ రికార్డు లేకపోయినా, కేవలం సచిన్ కొడుకు అన్న ట్యాగ్ తోనే ఐపీఎల్ ఎంట్రీ దక్కిందంటూ విమర్శిస్తున్నారు. అయితే, మరి కొందరు అర్జున్ కు మద్దతు పలుకుతున్నారు.

  రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థి అయితే ఫర్వాలేదు గానీ, సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ లో చోటు దక్కించుకుంటేనే మీకు బాధ వస్తోందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముంబై జట్టు తప్ప ఎవరైనా సరే.. అర్జున్ టెండూల్కర్ కొనుగోలు చేస్తే ట్విట్టర్ ను క్విట్ చేస్తానని మరికొందరు చురకలు అంటించారు. మరికొందరు.. శుభమన్ గిల్ టీమ్ లో, అర్జున్ ఉంటే బాగుండూ అంటూ చమత్కరిస్తున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Arjun Tendulkar, IPL 2021, T20 Auction 2021

  ఉత్తమ కథలు