హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : కేదార్ జాదవ్‌‌ను తీసుకున్నారంటే మీది మాములు గుండె కాదు.. SRH పై ఫ్యాన్స్ ఫైర్...

IPL 2021 : కేదార్ జాదవ్‌‌ను తీసుకున్నారంటే మీది మాములు గుండె కాదు.. SRH పై ఫ్యాన్స్ ఫైర్...

కేదార్ జాదవ్

కేదార్ జాదవ్

IPL Auction 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. అన్ని ఫ్రాంచైజీలు పొదుపు లెక్కలు వేసుకుని మరి వేలంలో దూసుకుపోయాయ్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది.

ఇంకా చదవండి ...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. అన్ని ఫ్రాంచైజీలు పొదుపు లెక్కలు వేసుకుని మరి వేలంలో దూసుకుపోయాయ్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. మినీ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ తమ పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో సీఎస్‌కే వద్దనుకొని వదిలేసిన కేదార్‌ జాదవ్‌కు రూ.2 కోట్లు, బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌కు రూ.1.5 కోట్లు, జగదీశా సుచిత్‌కు రూ. 30లక్షలు వెచ్చించింది. మనీ పర్స్ భాగానే ఉన్నా స్టార్ల కోసం సన్‌రైజర్స్ పోటీపడలేదు. ముఖ్యంగా విదేశీ స్టార్లతో నిండి ఉన్న జట్టుకు దేశవాళీ ఆటగాళ్లను తీసుకోవాలనే ఆలోచనే చేయలేదు. కృష్ణప్ప గౌతమ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుందామని ప్రయత్నించినా.. వారి ధర అమాంతం పెరగడంతో ఏం చేయలేకపోయామని టీమ్‌మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. అయితే వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా కేదార్‌ జాదవ్‌ విషయంలో సన్‌రైజర్స్‌ అభిమానులు పెట్టిన మీమ్స్ వైరల్‌ అయ్యాయి. "ఫామ్‌లో లేని ఆటగాడిని తీసుకొని ఏం చేస్తుంది.. అసలు సన్‌రైజర్స్‌ వ్యూహం ఏంటో ఎవరికి అంతుపట్టదు.. సీఎస్‌కే వద్దనుకుంది.. సన్‌రైజర్స్‌ కావాలనుకుంటుంది."అంటూ కామెంట్స్‌ చేశారు.

జాదవ్‌ సరిగ్గా ఆడటం లేదనే చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుందని, అతను మంచి ఆటగాడైతే ధోనీ ఎందుకు వదులుతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా వేలానికి వెళ్లారని సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏ ఫ్రాంచైజీ కూడా అతని కోసం పోటీ పడలేదని, అతని ప్లేస్‌లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టెస్ట్ ప్లేయర్ హనుమ విహారిని తీసుకున్నా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కనీసం స్థానిక ఆటగాడికి అవకాశం ఇచ్చారనే ఆసక్తి ఉండేదంటున్నారు.

కేదార్‌ జాదవ్‌ గత సీజన్‌లో సీఎస్‌కే తరపున 8 మ్యాచ్‌లాడి 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అందుకే కేదార్‌ జాదవ్‌ మొదటిసారి వేలంలోకి వచ్చినప్పుడు కనీసం అతన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కానీ రెండోసారి వేలంలోకి వచ్చిన జాదవ్‌ను అనూహ్యంగా సన్‌రైజర్స్‌ రూ. 2కోట్ల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావించినప్పుడు ఫామ్‌లో ఉన్నకృష్ణప్ప గౌతమ్‌, కెఎస్‌ భరత్‌ లాంటి ఆటగాళ్లవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ చూస్తే బాగుండేది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: IPL 2021, Sunrisers Hyderabad, T20 Auction 2021

ఉత్తమ కథలు