హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL Auction 2021 : సచిన్ కొడుకని అర్జున్ టెండూల్కర్ ని జట్టులోకి తీసుకుందా..దీనిపై ముంబై ఏమందంటే...

IPL Auction 2021 : సచిన్ కొడుకని అర్జున్ టెండూల్కర్ ని జట్టులోకి తీసుకుందా..దీనిపై ముంబై ఏమందంటే...

IPL Auction 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఫ్రాంచైజీలన్నీ ఆల్ రౌండర్లు, బౌలర్లపై ఎక్కువ దృష్టి పెట్టాయ్. ఇక గురువారం జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండూల్కర్‌ను అతని కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఫ్రాంచైజీలన్నీ ఆల్ రౌండర్లు, బౌలర్లపై ఎక్కువ దృష్టి పెట్టాయ్. ఇక గురువారం జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండూల్కర్‌ను అతని కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం సచిన్ కొడుకనే ముంబై అర్జున్‌ను జట్టులోకి తీసుకుందని, క్రికెట్‌లో నెపోటిజం ఎక్కువైపోయిందని చాలా మంది విమర్శించారు. అర్జున్‌ను ముంబై తీసుకుంటుందని ముందే ఊహించామని, అసలు అతనికి ఏం అర్హత ఉందని వేలంలో కొనుగోలు చేశారని చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడని, అతని కంటే బాగా రాణించిన పేసర్లు ఎందరో ఉన్నా వారికి అవకాశం దక్కలేదని కామెంట్ చేశారు. రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్‌ స్పందించిన తీరు, అర్జున్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్‌ చేశారు.అయితే, దీనిపై ముంబై హెడ్ కోచ్ మహేళ జయవర్దనే స్పందించారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకని అర్జున్ టెండూల్కర్‌ను జట్టులోకి తీసుకోలేదని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే స్పష్టం చేశాడు. అర్జున్ క్రీడా నైపుణ్యాల ఆధారంగానే కొనుగోలు చేశామన్నాడు. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, అతను కూడా ఈ లీగ్‌ ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉందన్నాడు.

  మరోవైపు, ముంబై టీమ్‌మేనేజ్‌మెంట్ అర్జున్ ఎంపికను సమర్థించుకుంది. ఈ విమర్శలకు హెడ్ కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.. "అర్జున్‌ టెండూల్కర్‌పై సచిన్‌ కుమారుడు అనే అతిపెద్ద ట్యాగ్‌ ఉండటం సహజం. అయితే అదృష్టవశాత్తూ అతడు బ్యాట్స్‌మన్‌ కాకుండా, బౌలర్‌ అయ్యాడు. నిజానికి అర్జున్‌ బౌలింగ్‌ తీరు పట్ల సచిన్‌ ఎంతో గర్వపడతారు. అయితే మేం కేవలం బౌలింగ్‌ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నాం. ఇంతవరకు ముంబై తరఫున ఆడిన అర్జున్‌, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్నాడు. ఆట పట్ల తనకున్న శ్రద్ధ అమోఘం. తనపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమే మా బాధ్యత. మిగతాది అతనే చూసుకుంటాడు" అని తెలిపాడు.

  అర్జున్‌ను తీసుకోవడంపై ముంబై టీమ్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ సైతం ఓ వీడియోలో స్పష్టతినిచ్చే ప్రయత్నం చేశాడు. "అర్జున్‌ నైపుణ్యాల గురించి మా కోచింగ్ సిబ్బంది మహేల జయవర్ధనె, జహీర్ ‌ఖాన్‌ ముందే చెప్పారు. సచిన్‌ తనయుడు ఎడమ చేతి వాటం ఫాస్ట్‌బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ అని వివరించారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలా ఎక్కువ మంది లేరని చెప్పారు. ఇతర యువ ఆటగాళ్లలాగే అర్జున్‌ కూడా ఈ స్థాయికి చేరుకున్నాడు. జట్టులో ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి వారిలోని అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తెస్తాం. అయితే అదంతా ఆయా ఆటగాళ్లు కష్టపడటంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకోసం తగిన ఏర్పాట్లు తాము చేస్తాం. భవిష్యత్‌లో అర్జున్‌ కూడా ఇతరుల్లాగే మెరుగైన క్రికెటర్‌గా తయారవుతాడు" అని ఆకాశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

  First published:

  Tags: Arjun Tendulkar, IPL 2021, Sachin Tendulkar, T20 Auction 2021

  ఉత్తమ కథలు