ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి మ్యాచ్ మ్యాచుకీ దారుణంగా మారుతోంది. ఆ జట్టు గెలవడమే గగనంగా మారిపోయింది. లేటెస్ట్ గా ముంబై ఇండియన్స్‌పై లక్నోసూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో, తమ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. 200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (27 బంతుల్లో 37 పరుగులు ; 3 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (13 బంతుల్లో 31 పరుగులు ; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. ఇక, రోహిత్ శర్మ (6), ఇషాన్ కిషన్ (13) నిరాశపర్చారు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 13 పరుగులు చేసి టెస్ట్ బ్యాటింగ్ ను తలపించాడు. జూనియర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ కేవలం 13 బంతుల్లో 31 పరుగులు చేసి అదరగొడితే.. రూ.15.25 కోట్ల విలువైన ఆటగాడు ఇషాన్ మాత్రం నిరాశపర్చాడు.
13 పరుగులు చేసిన ఇషాన్ స్టోయినిస్ వేసిన 7వ ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, ఔట్ తర్వాత ఇషాన్ కిషన్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. ఔటైన కోపం తట్టుకోలేక మనోడు చేసిన పనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఈ మ్యాచులో ఔటైన తర్వాత పెవిలియన్ కు వెళుతూ.. ఇషాన్ కిషన్ ఫస్ట్రేషన్ తట్టుకోలేక.. తన ప్రతాపాన్ని అంతా బౌండరీ కుషన్లపై చూపించాడు. తన బ్యాట్ తో బౌండరీ కుషన్లు గట్టిగా బాదాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక, ఈ చర్యతో ఇషాన్ కిషన్ పై ఫైన్ వేసే అవకాశం ఉంది.
అయితే, ఈ వీడియో నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. బాబు ఇషాన్ కిషన్ ఈ ప్రతాపం ఏంటో బౌలర్ల మీద చూపించి ఉంటే నీ రూ.15.25 కోట్లుకు న్యాయం జరిగి ఉండేది కదా అని సెటైర్లు పేలుస్తున్నారు. ఇక, ముంబై అతనిపై అనవసరంగా రూ.15 కోట్లు వేస్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ ఘనంగా ప్రారంభించిన ఇషాన్ ఆ తర్వాత జీరోగా మారిపోతున్నాడు. ఫస్ట్ రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీల చేసిన తర్వాత అతని బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. దీంతో, ముంబై ఫ్యాన్స్ అతనిపై ఫైరవుతున్నారు.
— Diving Slip (@SlipDiving) April 16, 2022
Ishan Kishan smashed the boundary cushions with the bat after getting out. He might be fined for this. pic.twitter.com/UtQsTYHeOT
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2022
ఇక, ఈ మ్యాచులో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన స్టైలిష్ బ్యాటింగ్ తో మరోసారి మెరిశాడు. ముంబై మ్యాచులో 9 ఫోర్లు, 5 సిక్సులతో 60 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కేఎల్ రాహుల్. ఇక, సూపర్ సెంచరీతో అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్‌లో ఈ మ్యాచ్ రాహుల్‌కు 100వది. దీంతో 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. 5 సెంచరీలతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. సంజూ శాంసన్ కూడా 3 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Viral Video