IPL 2023 Schedule : ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ (BCCI) అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ధనాధన్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023 Schedule) షెడ్యూల్ ను శుక్రవారం బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 16వ సీజన్ జరగనుంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అంటే గురు శిష్యులుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని, హర్దీక్ పాండ్యా జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 16వ సీజన్ గ్రాండ్ గా ఓపెన్ కానుంది. గత సీజన్ లాగే ఈసారి కూడా 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉండగా.. గ్రూప్ ‘బి’లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.
ప్రతి జట్టు కూడా తమ గ్రూప్ లోని మిగిలిన జట్లతో రెండేసి సార్లు.. అవతలి గ్రూప్ లోని నాలుగు జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. ఇక మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతుంది. ఈ లెక్కన ప్రతి జట్టు కూడా లీగ్ లో 14 మ్యాచ్ లను ఆడుతుంది. లీగ్ స్టేజ్ మే 21 వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మే 28న జరగనుంది. ఈసారి ఐపీఎల్ ను 12 వేదికల్లో నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , కోల్ కతా, జైపూర్, ముంబై, గువాహటి, ధర్మశాలల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్స్ గా మొహాలీ, ధర్మశాలలను.. రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్స్ గా జైపూర్, గువాహటిలను ఉపయోగించనున్నాయి. కరోనా ముందుకు లాగా హోం, అవే పద్దతిన మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 18 డబుల్ హెడర్స్ ఉంటాయి. డబుల్ హెడర్స్ సమయంలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30లకు ఆరంభం అవుతుంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30లకు ఆరంభం కానుంది. ఒక మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం రాత్రి 7.30లకు ఆరంభం కానుంది.
పూర్తి షెడ్యూల్
తేది | ఎవరు ఎవరితో | వేదిక | సమయం |
మార్చి 31 | గుజరాత్ X చెన్నై | అహ్మదాబాద్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 1 | పంజాబ్ X కోల్ కతా | కోల్ కతా | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 1 | లక్నో X ఢిల్లీ | ఢిల్లీ | రాత్రి.గం. 7.30లకు |
ఏప్రిల్ 2 | హైదరాబాద్ X రాజస్తాన్ | హైదరాబాద్ | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 2 | బెంగళూరు X ముంబై | బెంగళూరు | రాత్రి. గం. 7.30లకు |
ఏప్రిల్ 3 | చెన్నై X లక్నో | చెన్నై | రాత్రి. గం. 7.30లకు |
ఏప్రిల్ 4 | ఢిల్లీ X గుజరాత్ | ఢిల్లీ | రాత్రి. గం. 7.30లకు |
ఏప్రిల్ 5 | రాజస్తాన్ X పంజాబ్ | గువాహటి | రాత్రి గం.7.30లకు |
ఏప్రిల్ 6 | కోల్ కతా X బెంగళూరు | కోల్ కతా | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 7 | లక్నో X హైదరాబాద్ | లక్నో | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 8 | రాజస్తాన్ X ఢిల్లీ | గువాహటి | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 8 | ముంబై X చెన్నై | ముంబై | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 9 | గుజరాత్ X కోల్ కతా | అహ్మదాబాద్ | మ.గం.3.30లకు |
ఏప్రిల్ 9 | హైదరాబాద్ X పంజాబ్ | హైదరాబాద్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 10 | బెంగళూరు X లక్నో | బెంగళూరు | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 11 | ఢిల్లీ X ముంబై | ఢిల్లీ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 12 | చెన్నై X రాజస్తాన్ | చెన్నై | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 13 | పంజాబ్ X గుజరాత్ | మొహాలి | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 14 | కోల్ కతా X హైదరాబాద్ | కోల్ కతా | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 15 | బెంగళూరు X ఢిల్లీ | బెంగళూరు | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 15 | లక్నో X పంజాబ్ | లక్నో | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 16 | ముంబై X కోల్ కతా | ముంబై | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 16 | గుజరాత్ X రాజస్తాన్ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 17 | బెంగళూరు X చెనై | బెంగళూరు | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 18 | హైదరాబాద్ X ముంబై | హైదరాబాద్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 19 | రాజస్తాన్ X లక్నో | జైపూర్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 20 | పంజాబ్ X బెంగళూరు | మొహాలి | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 20 | ఢిల్లీ X కోల్ కతా | ఢిల్లీ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 21 | చెన్నై X హైదరాాబాద్ | చెన్నై | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 22 | లక్నో X గుజరాత్ | లక్నో | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 22 | ముంబై X పంజాబ్ | ముంబై | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 23 | బెంగళూరు X రాజస్తాన్ | బెంగళూరు | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 23 | కోల్ కతా X చెన్నై | కోల్ కతా | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 24 | హైదరాబాాద్ X ఢిల్లీ | హైదరాబాద్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 25 | గుజరాత్ X ముంబై | అహ్మదాబాద్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 26 | బెంగళూరు X కోల్ కతా | బెంగళూరు | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 27 | రాజస్తాన్ X చెన్నై | జైపూర్ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 28 | పంజాబ్ X లక్నో | మొహాలి | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 29 | కోల్ కతా X గుజరాత్ | కోల్ కతా | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 29 | ఢిల్లీ X హైదరాబాద్ | ఢిల్లీ | రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 30 | చెన్నై X పంజాబ్ | చెన్నై | మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 30 | ముంబై X రాజస్తాన్ | ముంబై | రాత్రి గం. 7.30లకు |
మే 1 | లక్నో X రాజస్తాన్ | లక్నో | రాత్రి గం. 7.30లకు |
మే 2 | గుజరాత్ X ఢిల్లీ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7.30లకు |
మే 3 | పంజాబ్ X ముంబై | మొహాలి | రాత్రి గం. 7.30లకు |
మే 4 | లక్నో X చెన్నై | లక్నో | మ.గం. 3.30లకు |
మే 4 | హైదరాబాద్ X కోల్ కతా | హైదరాబాద్ | రాత్రి గం. 7.30లకు |
మే 5 | రాజస్తాన్ X గుజరాత్ | జైపూర్ | రాత్రి గం. 7.30లకు |
మే 6 | చెన్నై X ముంబై | చెన్నై | మ.గం. 3.30లకు |
మే 6 | ఢిల్లీ X బెంగళూరు | ఢిల్లీ | రాత్రి గం. 7.30లకు |
మే 7 | గుజరాత్ X లక్నో | అహ్మదాబాద్ | మ.గం. 3.30లకు |
మే 7 | రాజస్తాన్ X హైదరాబాద్ | జైపూర్ | రాత్రి గం. 7.30లకు |
మే 8 | కోల్ కతా X పంజాబ్ | కోల్ కతా | రాత్రి గం. 7.30లకు |
మే 9 | ముంబై X బెంగళూరు | ముంబై | రాత్రి గం. 7.30లకు |
మే 10 | చెన్నై X ఢిల్లీ | చెన్నై | రాత్రి గం. 7.30లకు |
మే 11 | కోల్ కతా X రాజస్తాన్ | కోల్ కతా | రాత్రి గం. 7.30లకు |
మే 12 | ముంబై X గుజరాత్ | ముంబై | రాత్రి గం. 7.30లకు |
మే 13 | హైదరాబాద్ X లక్నో | హైదరాబాద్ | మ.గం. 3.30లకు |
మే 13 | ఢిల్లీ X పంజాబ్ | ఢిల్లీ | రాత్రి గం. 7.30లకు |
మే 14 | రాజస్తాన్ X బంగళూరు | జైపూర్ | మ.గం. 3.30లకు |
మే 14 | చెన్నై X కోల్ కతా | చెన్నై | రాత్రి గం. 7.30లకు |
మే 15 | గుజరాత్ X హైదరాబాద్ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7.30లకు |
మే 16 | లక్నో X ముంబై | లక్నో | రాత్రి గం. 7.30లకు |
మే 17 | పంజాబ్ X ఢిల్లీ | ధర్మశాల | రాత్రి గం. 7.30లకు |
మే 18 | హైదరాబాద్ X బెంగళూరు | హైదరాబాద్ | రాత్రి గం. 7.30లకు |
మే 19 | పంజాబ్ X రాజస్తాన్ | ధర్మశాల | రాత్రి గం. 7.30లకు |
మే 20 | ఢిల్లీ X చెన్నై | ఢిల్లీ | మ.గం. 3.30లకు |
మే 20 | కోల్ కతా X లక్నో | కోల్ కతా | రాత్రి గం. 7.30లకు |
మే 21 | ముంబై X హైదరాబాద్ | ముంబై | మ.గం. 3.30లకు |
మే 21 | బెంగళూరు X గుజరాత్ | బెంగళూరు | రాత్రి గం. 7.30లకు |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Delhi Capitals, Gujarat Titans, Indian premier league, IPL 2023, Kolkata Knight Riders, Lucknow Super Giants, Mumbai Indians, Punjab kings, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad