ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 (IPL 2023) క్లైమ్యాక్స్ కు చేరుకుంది. ఈ సీజన్ లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ వన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. మరో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ (GT vs MI) తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించిన ముంబై రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఫైనల్ చేరనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం (మే 26) రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ 2023 ఆరంభం నుంచి ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ కీలక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో చేతులెత్తేసింది. శుభ్ మన్ గిల్ ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే ఫామ్ క్వాలిఫయర్ 2 లో కంటిన్యూ చేయాలని భావిస్తుంది. వృద్ధిమాన్ సాహా, దాసున్ షనక, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ నిలకడలేమి గుజరాత్ ను టెన్షన్ పెడుతుంది. అయితే.. ఆఖర్లో రాహుల్ తేవటియా, రషీద్ ఖాన్ మెరుపులు మెరిపిస్తు్న్నారు. విజయ్ శంకర్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు.
ఇక.. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలర్లు రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ వికెట్స్ తీస్తుండడం కలిసొచ్చే అంశం. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో టాప్ -2 వో ఉన్నారు. షమీ 26 వికెట్లు తీస్తే.. రషీద్ ఖాన్ 25 వికెట్లు తీశాడు. మరో యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. వీరందరూ రాణిస్తే ముంబైకి కష్టాలు తప్పవు.
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంది బ్యాటర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ మంచి ఫామ్ మీదున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ మంచి టచ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తిలక్ వర్మ, నేహాల్ వథేరా కీలక ఇన్నింగ్స్ లు ఆడుతూ జట్టుకు వెన్నెముకలా మారారు. వీరిని అడ్డుకోవడం గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు కష్టమే.
అయితే, ముంబై బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా ఉంది. అయితే.. ఎలిమినేటర్ మ్యాచులో బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. ఇక.. స్పిన్నర్ పీయూష్ చావ్లా ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. 21 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. జాసన్ బెహాండ్రాఫ్, గ్రీన్, కుమార్ కార్తీకేయ, క్రిస్ జోర్డాన్ కూడా బౌలింగ్ లో సత్తా చాటితే ముంబైకి తిరుగుండదు. క్వాలిఫయర్ 2లో వీరు చెలరేగితే విజయం సులువే. క్వాలిఫయర్ 2 కోసం ముంబై ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.
తుది జట్లు అంచనా :
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, దసున్ షనక, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వధేరా, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మద్వాల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Gujarat Titans, Hardik Pandya, IPL 2023, Mumbai Indians, Rohit sharma, Shubman Gill, Surya Kumar Yadav