మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచులో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో నేనున్నాను అంటూ వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి కోల్‌కతా 16వ ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శార్దూల్ ఠాకూర్ (8), సునీల్ నరైన్ (7) పరుగులతో ఉన్నారు. ఇక కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు చేయాలి. అదే విధంగా డక్ వర్త్ లూయిస్ ప్రకారం కేకేఆర్ ప్రస్తుతం 153 పరుగులు చేయాల్సి ఉంది. కానీ.. ఏడు పరుగులు వెనుకంజలో ఉంది.
ఒక వేళ వర్షం ఆగకపోతే.. మ్యాచ్ పంజాబ్ సొంతమవుతుంది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్ (19 బంతుల్లో 35 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (28 బంతుల్లో 34 పరుగలు ; 3 ఫోర్లు, 1 సిక్సర్), నితీష్ రాణా (17 బంతుల్లో 24 పరుగులు), గుర్బాజ్ (16 బంతుల్లో 22 పరుగులు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లతో కేకేఆర్ జోరుకు బ్రేకులు వేశాడు. శామ్ కర్రన్, నాథన్ ఎల్లీస్, సికిందర్ రజా, రాహుల్ చాహర్ తలా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో భానుక రాజపక్స (32 బంతుల్లో 50 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 40 పరుగులు ; 6 ఫోర్లు), ప్రభుసిమ్రన్ సింగ్ (12 బంతుల్లో 23 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేష్ శర్మ (11 బంతుల్లో 21 పరుగులు) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీశాడు. ఉమేష్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీశారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు యంగ్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్. 12 బంతుల్లో 23 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ దూకుడుకి టిమ్ సౌతీ అడ్డుకట్ట వేశాడు. సిమ్రాన్ ను ఔట్ చేశాడు. దీంతో.. 23 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్. ఆ తర్వాత వచ్చిన భానుక రాజపక్స కూడా తగ్గేదే లే అన్నట్టు చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ యాంకర్ రోల్ ప్లే చేశాడు. భానుక రాజపక్స 31 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు.
అయితే.. ఆ వెంటనే ఔటయ్యాడు. ఉమేష్.. రాజపక్స జోరుకు బ్రేకులు వేశాడు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ కూడా 11 బంతుల్లో 21 పరుగులు మెరుపులు మెరిపించాడు. అయితే.. వరుస విరామాల్లో జితేష్ (21), శిఖర్ (40) పరుగులు ఔటయ్యారు. ఆఖర్లో రజా, శామ్ కర్రన్, షారుఖ్ ఖాన్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2023, Kolkata Knight Riders, Nitish Rana, Punjab kings, Shikhar Dhawan