మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచులో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో భానుక రాజపక్స (32 బంతుల్లో 50 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 40 పరుగులు ; 6 ఫోర్లు), ప్రభుసిమ్రన్ సింగ్ (12 బంతుల్లో 23 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేష్ శర్మ (11 బంతుల్లో 21 పరుగులు) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీశాడు. ఉమేష్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీశారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు యంగ్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్. 12 బంతుల్లో 23 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ దూకుడుకి టిమ్ సౌతీ అడ్డుకట్ట వేశాడు. సిమ్రాన్ ను ఔట్ చేశాడు. దీంతో.. 23 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్. ఆ తర్వాత వచ్చిన భానుక రాజపక్స కూడా తగ్గేదే లే అన్నట్టు చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ యాంకర్ రోల్ ప్లే చేశాడు. భానుక రాజపక్స 31 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు.
.@BhanukaRajapak3 ???? showing that classic Sri Lankan flair; scores a ???? class half-century ????#PBKSvKKR | LIVE & FREE with #JioCinema across all telecom operators ✨#IPL2023 #TATAIPL2023 #TATAIPL #IPLonJioCinema | @PunjabKingsIPL pic.twitter.com/aryACm4d65
— JioCinema (@JioCinema) April 1, 2023
అయితే.. ఆ వెంటనే ఔటయ్యాడు. ఉమేష్.. రాజపక్స జోరుకు బ్రేకులు వేశాడు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ కూడా 11 బంతుల్లో 21 పరుగులు మెరుపులు మెరిపించాడు. అయితే.. వరుస విరామాల్లో జితేష్ (21), శిఖర్ (40) పరుగులు ఔటయ్యారు. ఆఖర్లో రజా, శామ్ కర్రన్, షారుఖ్ ఖాన్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది.
తుది జట్లు :
కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మణ్ దీప్ సింగ్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అంకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : సుయాష్, వైభవ్ అరోరా, జగదీషన్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ వీస్
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, సామ్ కర్రన్, సికిందర్ రజా, నాథన్ ఎల్లీస్, హర్ ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : రిషి ధావన్, అథర్వ తైడే, మ్యాట్ షార్ట్, హర్ ప్రీత్ సింగ్ భాటియా, మోహిత్ రాథే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2023, Kolkata Knight Riders, Nitish Rana, Punjab kings, Shikhar Dhawan