క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL 2023) టోర్నీ తిరిగి ప్రారంభ అయింది. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ మొదటి మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, శనివారం ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా. శనివారం డబుల్ హెడ్డర్ మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్.
రెండు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే... ఈ జట్ల రికార్డు పోటాపోటీగా ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మొహాలీలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడనుండగా, పంజాబ్ కింగ్స్ కాస్త ఫేవరెట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పంజాబ్ జట్టుకు ఇదే హోమ్ గ్రౌండ్. కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా జట్టు రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేకుండానే రంగంలోకి దిగనుంది.
వెన్ను గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతానికి తన జట్టుకు దూరమయ్యాడు. అతను కొన్ని మ్యాచ్‌ల తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంది లేదా అతను IPL 2023 నుండి పూర్తిగా నిష్క్రమించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ పగ్గాలు నితీష్ రాణా చేతిలో ఉన్నాయి. వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ వంటి డేంజరస్ ప్లేయర్లు కోల్ కతా జట్టులో ఉన్నారు.
మరోవైపు.. పంజాబ్ కింగ్స్ జట్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి డేంజరస్ ప్లేయర్స్ పంజాబ్ కింగ్స్ సొంతం. కగిసో రబాడా ఫస్ట్ మ్యాచుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా ప్లేయర్స్ నేషనల్ డ్యూటీలో ఉన్నారు.
పిచ్ రిపోర్ట్:
మొహాలీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనదిగా చెబుతారు. ఇక్కడ మైదానం చిన్నది. బౌండరీలు సులభంగా కొట్టవచ్చు. ఇక్కడ జరిగిన ఆరు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు 200కి పైగా పరుగులు వచ్చాయి.
తుది జట్లు :
కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మణ్ దీప్ సింగ్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అంకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, సామ్ కర్రన్, సికిందర్ రజా, నాథన్ ఎల్లీస్, హర్ ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2023, Kolkata Knight Riders, Nitish Rana, Punjab kings, Shikhar Dhawan