మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచులో పంజాబ్ విక్టరీ కొట్టింది. వరుణుడు ఎంట్రీతో పంజాబ్ విజయం సులువైంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో నేనున్నాను అంటూ వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత వర్షం ఆగలేదు. దీంతో.. డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం ఏడు పరుగుల తేడాతో పంజాబ్ విక్టరీ కొట్టింది. వర్షం రాకపోయింటే మరో మ్యాచ్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చి ఉండేది. వర్షంతో ఆట ముగిసే సమయానికి కోల్‌కతా 16వ ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో శార్దూల్ ఠాకూర్ (8), సునీల్ నరైన్ (7) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు చేయాలి. కానీ, డక్ వర్త్ లూయిస్ ప్రకారం కేకేఆర్ ప్రస్తుతం 153 పరుగులు చేయాల్సి ఉంది. కానీ.. ఏడు పరుగులు వెనుకంజలో ఉంది.దీంతో.. కేకేఆర్ కు ఓటమి తప్పలేదు.
టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో భానుక రాజపక్స (32 బంతుల్లో 50 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 40 పరుగులు ; 6 ఫోర్లు), ప్రభుసిమ్రన్ సింగ్ (12 బంతుల్లో 23 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేష్ శర్మ (11 బంతుల్లో 21 పరుగులు) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీశాడు. ఉమేష్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీశారు.
192 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కి మంచి ఆరంభం లభించలేదు. టాపార్డర్ తడబడింది. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్ తొలి బంతికి మన్‌దీప్ సింగ్ బలి అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఓవర్ అది. అప్పటికి జట్టు స్కోరు 13 పరుగులే. అదే ఓవర్ చివరి బంతికి అనుకూల్ రాయ్ కూడా వెనుదిరిగాడు. నాలుగు పరుగులే చేసిన అనుకూల్ రాయ్.. సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అయితే, తొలి మ్యాచే అయినప్పటికీ- అఫ్గానిస్తాన్‌కు చెందిన డెబ్యుటెంట్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకట్టుకున్నాడు.
తక్కువ పరుగులే చేసినప్పటికీ స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని భారీ సిక్స్ గా మలిచాడు. స్టాండ్స్ దాటించాడు. దీని డిస్టెన్స్ 101 మీటర్లు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన వాటిల్లో ఇదే భారీ సిక్సర్. సామ్ కుర్రన్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాడు గుర్బాజ్.
woww pic.twitter.com/yySorVD2Qq
— javed ansari (@javedan00643948) April 1, 2023
ఐపీఎల్ లో అతను ఎదుర్కొన్న తొలి బంతి అదే. నాలుగో బంతికి మన్‌దీప్ కూడా సింగిల్ తీయడంతో స్ట్రైక్ రొటేట్ అయింది. సామ్ కుర్రన్ వేసిన లెంగ్త్ డెలివరీని 101 మీటర్ల దూరానికి పంపించాడు. ఆ తరువాత కూడా అతని దూకుడు కొనసాగింది. ఆరో బంతికి ఫోర్ కొట్టాడు. 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు గుర్బాజ్. అయిదో ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు. ఎల్లిస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Watta way to introduce yourself in IPL ???????? Rahmanullah Gurbaz Hits a 100m+ Sixxxxx#KKRvsPBKS #IPL2023 pic.twitter.com/9aGPjoeoMp
— мυffууу????_ук (@nonedible_muffy) April 1, 2023
ఇక, కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్ (19 బంతుల్లో 35 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (28 బంతుల్లో 34 పరుగలు ; 3 ఫోర్లు, 1 సిక్సర్), నితీష్ రాణా (17 బంతుల్లో 24 పరుగులు), గుర్బాజ్ (16 బంతుల్లో 22 పరుగులు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లతో కేకేఆర్ జోరుకు బ్రేకులు వేశాడు. శామ్ కర్రన్, నాథన్ ఎల్లీస్, సికిందర్ రజా, రాహుల్ చాహర్ తలా ఓ వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, IPL 2023, Kolkata Knight Riders, Punjab kings, Shikhar Dhawan