IPL 2023 Mini Auction Updates : కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ (IPL) మినీ వేలం ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. పేరుకే మినీ వేలం కానీ.. మెగా వేలానికి మించి ప్లేయర్లపై డబ్బును వెదజల్లుతుంది. ఇంగ్లండ్ (England) కు చెందిన స్యామ్ కరణ్ (Sam currun) ఐపీఎల్ వేలంలో కొత్త రికార్డును లఖించింది. కరణ్ ను రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) సొంతం చేసుకుంది. గతంలో సౌతాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ (రూ. 16.25 కోట్లు) వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా ఉన్నాడు. అయితే అతడిని ఈ వేలంలో పలువరు ప్లేయర్లు దాటేశారు. ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్.. రూ. 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.
ఈ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు ప్రదర్శించింది. అత్యధిక మనీ పర్సుతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 9 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ కు చెందిన హ్యారీ బ్రూక్ రూ. 13.25 కోట్లకు సొంతం చేసుకుంది. బ్రూక్స్ ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టి20 ప్రపంచకప్ ముందు జరిగిన టి20 సిరీస్ లో పాకిస్తాన్ పై చెలరేగిపోయాడు. టి20 ప్రపంచకప్ లో కూాడా మంచి ప్రదర్శన చేశాడు. ఇక ఇటీవలె పాకిస్తాన్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో మూడు సెంచరీలతో రెచ్చిపోయాడు. దంచి కొట్టడంలో బ్రూక్ శైలే వేరు. ఇతడిని సొంతం చేసుకోవడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ మరింత బలంగా మారింది. ఇతడితో పాటు మయాంక్ అగర్వాల్ ను 8.25 కోట్లకు.. హెన్రిచ్ క్లాసెన్ ను రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. స్పిన్ విభాగంలో కూడా కీలక ప్లేయర్ ను సొంతం చేసుకుంది. రూ. 2 కోట్లకు ఆదిల్ రషీద్ ను సొంతం చేసుకుంది. ఇక జమ్మూ కశ్మీర్ కు చెందిన వవ్రంత్ శర్మ రూ. 2.60 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇక గుంటూరుకు చెందిన అండర్ 19 టీమిండియా వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ను రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 32 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడయ్యారు. 87 ఖాళీల కోసం 405 మంది ప్లేయర్లు వేలంలో ఉన్నారు.
ఇప్పటి వరకు ఏ జట్టు ఎవర్ని కొనుగోలు చేసిందంటే
సన్ రైజర్స్ హైదరాబాద్ : బ్రూక్ (13.25, ఇంగ్లండ్), మయాంక్ అగర్వాల్ (8.25), హెన్రిచ్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు), వివ్రాంత్ శర్మ (రూ. 2.60 కోట్లు), ఆదిల్ రషీద్ (రూ. 2 కోట్లు), మయాంక్ మార్ఖండే (రూ. 50 లక్షలు), ఉపేంద్ర సింగ్ (రూ. 25 లక్షలు), సన్వీర్ సింగ్ (రూ. 20 లక్షలు), సమర్థ్ వ్యాస్ (రూ. 20 లక్షలు)
ముంబై ఇండియన్స్ : కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), జై రిచర్డ్ సన్ (రూ.1.50 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్ : నికోలస్ పూరన్ (రూ. 16 కోట్లు), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 50 లక్షలు), యశ్ ఠాకూర్ (రూ. 45 లక్షలు)
చెన్నై సూపర్ కింగ్స్ : బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు), నిషాంత్ సింధు (రూ.60 లక్షలు), రహానే (50 లక్షలు), షేక్ రషీద్ (రూ. 20 లక్షలు)
పంజాబ్ కింగ్స్ : స్యామ్ కరణ్ (రూ. 18.5 కోట్లు), సికిందర్ రాజా (రూ.50 లక్షలు)
గుజరాత్ టైటాన్స్ : శివమ్ మావి (రూ.6 కోట్లు), విలియమ్సన్ (రూ. 2 కోట్లు), కేఎస్ భరత్ (రూ. 1.20 కోట్లు), ఒడిన్ స్మిత్, (రూ. 50 లక్షలు)
రాజస్తాన్ రాయల్స్ : జేసన్ హోల్డర్ (రూ. 5.75 కోట్లు),
కోల్ కతా నైట్ రైడర్స్ : జగదీశన్ (రూ. 90 లక్షలు), వైభవ్ అరోరా (రూ. 60 లక్షలు)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : రీస్ టాప్లీ (రూ. 1.90 కోట్లు), హిమాన్షు శర్మ (రూ. 20 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్ : ముఖేశ్ కుమార్ (రూ. 5.5 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 2 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ. 50 లక్షలు)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Gujarat Titans, Indian premier league, IPL, IPL 2023 Mini Auction, Lucknow Super Giants, Punjab kings, Sunrisers Hyderabad