ఎంతో రసవత్తరంగా సాగిన ఐపీఎల్ మినీ వేలం (IPL Mini Auction) ముగిసింది. మొత్తం 405 మంది వేలంలోకి రాగా.. 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 51 మంది భారత ప్లేయర్లు కాగా.. 29 మంది విదేశీ ప్లేయర్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అత్యధికంగా 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. అయితే.. ఎప్పుడూ వేలం జరిగిన అందరి కళ్లు మాత్రం ఆమెపైనే ఉంటాయి. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఆమె ఎవరో. ఈ మెగావేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ (Kaviya Maran). బ్లూ కలర్ ఫార్మల్ డ్రెస్స్‌లో తళక్కుమన్న కావ్య జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం వేలంలో తగ్గేదేలేదంటూ దూసుకెళ్లింది. వేలం మొదట్లోనే ఇంగ్లండ్ ప్లేయర్ హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది.
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ కోసం.. పోటీ పడి రూ.8.25 కోట్లకు దక్కించుంది. అయితే.. కావ్య మారన్ అక్కడితో ఆగలేదు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రీ క్లాసెన్ కోసం రూ.5.25 కోట్ల ను ఖర్చు పెట్టింది. అయితే, మరోసారి కావ్య మారన్ ట్రోలింగ్ కు గురయ్యారు. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రీ క్లాసెన్ కోసం ఇంత వృధా చేయడాన్ని జీర్ణించలేకపోతున్నారు.
చాలా డబ్బులు పెట్టి అత్యధిక ధరతో చౌకైన వాటిని షాపింగ్ చేసిందని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు కావ్య ఇది షాపింగ్ కాదు.. అలా కొనేస్తున్నావ్ ఏంటి అని ఫన్నీ కామెంట్లు చేశారు. ఇక, బెన్ స్టోక్స్ కోసం సన్ రైజర్స్ పోటీపడకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. బెన్ స్టోక్స్ లాంటి 4 D ప్లేయర్ ను దక్కించుకుని ఉంటే.. సన్ రైజర్స్ కష్టాలన్నీ తీరిపోయేవని కామెంట్లు పెడుతున్నారు. అనవసరంగా హ్యారీ బ్రూక్, మయాంక్, క్లాసెన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టిందని మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
#IPL2023Auction #IPLAuction #KavyaMaran Kavya maran be like: pic.twitter.com/hhPWOheyCD
— Urwashi_07 (@UGwalwanshi) December 23, 2022
Kavya is shopping there..????
— Jithin #12 (@jithin_srt) December 23, 2022
కావ్య మారన్ సన్ నెట్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్నారు. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరీ మారన్ ల కూతురు కావ్యా మారన్. న్యూయార్క్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న లియోనార్డ్ ఎన్. స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి కావ్య తన MBA పూర్తి చేసింది. అంతకు ముందు కావ్య చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో బీకామ్ డిగ్రీ చేసింది. ఇక, న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ (జిటి) అతని ప్రాథమిక ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
Kavya Maran to each player - #IPLAuction #IPLAuction2022 #HarryBrook pic.twitter.com/FWIzxNsmeY
— MemeRaoAmbedkar (@MemeraoA) December 23, 2022
Harry 'Brook'ing some #TATAIPLAuction records before making his #TATAIPL debut ???? Watch #AuctionFreeOnJioCinema ➡ LIVE on #JioCinema ????#IPL2023Auction #IPLAuction #TATAIPLAuctionOnJioCinema pic.twitter.com/DobVKo7RHu
— JioCinema (@JioCinema) December 23, 2022
విలియమ్సన్ ఎస్ఆర్ హెచ్ తో IPL 2022లో గొప్పగా ఆడలేదు. 13 మ్యాచ్‌ల్లో 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్కసారి మాత్రమే 50 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 93.51 వద్ద చాలా తక్కువ స్థాయిలో ఉంది. నవంబర్‌లో జరిగే IPL 2023 వేలానికి ముందు అతనిని ఫ్రాంచైజీ విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2023 Mini Auction, Kane Williamson, Sunrisers Hyderabad