IPL 2022 Final : యూత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఏడాది తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ ప్రపంచ క్రికెట్ నే శాసించే స్థాయికి ఎదిగింది. తాజాగా ఐపీఎల్ మరో రికార్డును అందుకుంది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 29న ఐపీఎల్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నరేంద్ర మోదీ స్టేడియానికి 1,01,566 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
టి20 ఫార్మాట్ లో ఒక మ్యాచ్ కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరు కావడం ఇదే తొలిసారి. ఫలితంగా ఐపీఎల్ 2022 ఫైనల్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా ఈ రికార్డుకు సంబంధించిన అవార్డును గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధి నుంచి అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అభిమానుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.
A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI
— BCCI (@BCCI) November 27, 2022
ఇక సీజన్ లో తొలిసారి ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఫైనల్లో రాజస్తాన్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ లో రాజస్తాన్ తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. బట్లర్ (35 బంతుల్లో 39 పరుగులు ; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. ఇక, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. 131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో.. ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. గిల్ ( 43 బంతుల్లో 45 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్), మిల్లర్ (19 బంతుల్లో 32 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Guinness World Record, Gujarat Titans, Hardik Pandya, IPL 2022, Rajasthan Royals, Sanju Samson