లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో లక్నో భారీ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్ కైల్ మేయర్స్ (38 బంతుల్లో 73 పరుగులు ; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఆఖర్లో మరో విండీస్ వీరుడు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 36 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు )తో పాటు కృనాల్ పాండ్యా (15 పరుగులు నాటౌట్), ఆయుష్ బదోని (18 పరుగులు) మెరుపులు మెరిపించారు. కేఎల్ రాహుల్ (8), దీపక్ హుడా (17), స్టొయినిస్ (12) నిరాశపర్చారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు చెరో వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన లక్నోకి మంచి ఆరంభం లభించలేదు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 12 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి చేతన్ సకారియా బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే... మరో ఓపెనర్ కైల్ మేయర్స్ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు కన్నా సిక్సర్లు ఎక్కువ బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో దీపక్ హుడా బ్యాట్ నుంచి మెరుపులు రాలేదు. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ మేయర్స్ కి ఛాన్స్ ఇచ్చాడు.
A sneak peek of some brute force from Barbados ???????? If you're in Lucknow, watch your head! Watch #LSGvDC LIVE & FREE on #JioCinema across all telecom operators ????#IPL2023 #TATAIPL2023 #IPLonJioCinema pic.twitter.com/tQ2ekEF0lX
— JioCinema (@JioCinema) April 1, 2023
అయితే.. అంతా సెట్ అయిందనుకునేలోపు దీపక్ హుడా, కైల్ మేయర్స్ వరుస విరామాల్లో ఔటయ్యారు. దీపక్ హుడాను కుల్దీప్ యాదవ్ ఔట్ చేస్తే.. కైల్ మేయర్స్ ను ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు అక్షర్ పటేల్. ఆ తర్వాత కాసేపటికే స్టొయినిస్ ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయడంతో 117 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది లక్నో. అయితే, ఆఖర్లో పూరన్, కృనాల్, ఆయుష్ బదోని మెరుపులు మెరిపించడంతో మంచి స్కోరు సాధించింది.
గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. అద్భుతంగా రాణించింది. అయితే, ప్లే ఆఫ్ మ్యాచులో చేతులేత్తేసింది. కానీ, లీగ్ మ్యాచుల్లో సూపర్ ఆటతో ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో కూడా అదే ఆటతీరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ జట్టుకు దూరమవ్వడంతో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఢిల్లీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. ఈ సారైనా టైటిల్ లేని లోటు తీర్చుకోవాలని బరిలోకి దిగుతుంది.
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : ప్రేరక్ మన్కడ్, క్రిష్ణప్ప గౌతమ్, యష్ ఠాకూర్, డానియల్ సామ్స్, అమిత్ మిశ్రా
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలే రోసో, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : అమన్ హకీమ్ ఖాన్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, అభిషేక్ పొరెల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi Capitals, IPL 2023, KL Rahul, Lucknow Super Giants