హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2023 Schedule : క్రికెట్ పండుగ వచ్చేస్తుంది.. షెడ్యూల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వరకు.. పూర్తి వివరాలు మీకోసం..

IPL 2023 Schedule : క్రికెట్ పండుగ వచ్చేస్తుంది.. షెడ్యూల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వరకు.. పూర్తి వివరాలు మీకోసం..

IPL 2023 Schedule : క్రికెట్ పండుగ వచ్చేస్తుంది.. షెడ్యూల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వరకు.. పూర్తి వివరాలు మీకోసం..

IPL 2023 Schedule : క్రికెట్ పండుగ వచ్చేస్తుంది.. షెడ్యూల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వరకు.. పూర్తి వివరాలు మీకోసం..

IPL 2023 Schedule : క్రికెట్ ఫీవర్ మొదలైంది. క్రికెట్ లవర్స్ ను రెండు నెలల పాటు అలరించడానికి అసలు సిసలైన పండుగ వచ్చేస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

క్రికెట్ పండుగ ఐపీఎల్‌ (IPL 2023)కు రోజుల వ్యవధే మిగిలి ఉంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 16వ సీజన్ జరగనుంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడనుంది. అంటే గురు శిష్యులుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని, హర్దీక్ పాండ్యా జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 16వ సీజన్ గ్రాండ్ గా ఓపెన్ కానుంది. గత సీజన్ లాగే ఈసారి కూడా 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉండగా.. గ్రూప్ ‘బి’లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.

ప్రతి జట్టు కూడా తమ గ్రూప్ లోని మిగిలిన జట్లతో రెండేసి సార్లు.. అవతలి గ్రూప్ లోని నాలుగు జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. ఇక మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతుంది. ఈ లెక్కన ప్రతి జట్టు కూడా లీగ్ లో 14 మ్యాచ్ లను ఆడుతుంది. లీగ్ స్టేజ్ మే 21 వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మే 28న జరగనుంది. ఈసారి ఐపీఎల్ ను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.

అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , కోల్ కతా, జైపూర్, ముంబై, గువాహటి, ధర్మశాలల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్స్ గా మొహాలీ, ధర్మశాలలను.. రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్స్ గా జైపూర్, గువాహటిలను ఉపయోగించనున్నాయి. కరోనా ముందుకు లాగా హోం, అవే పద్దతిన మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 18 డబుల్ హెడర్స్ ఉంటాయి. డబుల్ హెడర్స్ సమయంలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30లకు ఆరంభం అవుతుంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30లకు ఆరంభం కానుంది. ఒక మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం రాత్రి 7.30లకు ఆరంభం కానుంది.

పూర్తి షెడ్యూల్

తేదిఎవరు ఎవరితోవేదికసమయం
మార్చి 31గుజరాత్  X చెన్నైఅహ్మదాబాద్రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 1పంజాబ్ X కోల్ కతాకోల్ కతామ.గం. 3.30లకు
ఏప్రిల్ 1లక్నో X  ఢిల్లీఢిల్లీరాత్రి.గం. 7.30లకు
ఏప్రిల్ 2హైదరాబాద్ X  రాజస్తాన్హైదరాబాద్మ.గం. 3.30లకు
ఏప్రిల్ 2బెంగళూరు X  ముంబైబెంగళూరురాత్రి. గం. 7.30లకు
ఏప్రిల్ 3చెన్నై X  లక్నోచెన్నైరాత్రి. గం. 7.30లకు
ఏప్రిల్ 4ఢిల్లీ X గుజరాత్ఢిల్లీరాత్రి. గం. 7.30లకు
ఏప్రిల్ 5రాజస్తాన్ X  పంజాబ్గువాహటిరాత్రి గం.7.30లకు
ఏప్రిల్ 6కోల్ కతా X  బెంగళూరుకోల్ కతారాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 7లక్నో X  హైదరాబాద్లక్నోరాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 8రాజస్తాన్ X  ఢిల్లీగువాహటిమ.గం. 3.30లకు
ఏప్రిల్ 8ముంబై X  చెన్నైముంబైరాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 9గుజరాత్ X కోల్ కతాఅహ్మదాబాద్మ.గం.3.30లకు
ఏప్రిల్ 9హైదరాబాద్ X పంజాబ్హైదరాబాద్రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 10బెంగళూరు X  లక్నోబెంగళూరురాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 11ఢిల్లీ X  ముంబైఢిల్లీరాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 12చెన్నై X  రాజస్తాన్చెన్నై రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 13పంజాబ్ X  గుజరాత్మొహాలి రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 14కోల్ కతా X  హైదరాబాద్కోల్ కతా రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 15బెంగళూరు X  ఢిల్లీబెంగళూరుమ.గం. 3.30లకు
ఏప్రిల్ 15లక్నో X  పంజాబ్లక్నో రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 16ముంబై X  కోల్ కతాముంబైమ.గం. 3.30లకు
ఏప్రిల్ 16గుజరాత్ X రాజస్తాన్అహ్మదాబాద్ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 17బెంగళూరు X చెనైబెంగళూరు రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 18హైదరాబాద్ X ముంబైహైదరాబాద్ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 19రాజస్తాన్ X లక్నోజైపూర్ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 20పంజాబ్ X బెంగళూరుమొహాలి మ.గం. 3.30లకు
ఏప్రిల్ 20 ఢిల్లీ X కోల్ కతాఢిల్లీ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 21చెన్నై X హైదరాాబాద్చెన్నై రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 22లక్నో X గుజరాత్లక్నోమ.గం. 3.30లకు
ఏప్రిల్ 22ముంబై X పంజాబ్ముంబై రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 23బెంగళూరు X రాజస్తాన్బెంగళూరుమ.గం. 3.30లకు
ఏప్రిల్ 23కోల్ కతా X చెన్నైకోల్ కతా రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 24హైదరాబాాద్ X ఢిల్లీహైదరాబాద్ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 25గుజరాత్ X ముంబైఅహ్మదాబాద్ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 26బెంగళూరు X కోల్ కతాబెంగళూరు రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 27రాజస్తాన్ X చెన్నైజైపూర్ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 28పంజాబ్ X లక్నోమొహాలి రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 29కోల్ కతా X గుజరాత్కోల్ కతామ.గం. 3.30లకు
ఏప్రిల్ 29ఢిల్లీ X హైదరాబాద్ఢిల్లీ రాత్రి గం. 7.30లకు
ఏప్రిల్ 30చెన్నై X పంజాబ్చెన్నైమ.గం. 3.30లకు
ఏప్రిల్ 30ముంబై X రాజస్తాన్ముంబైరాత్రి గం. 7.30లకు
మే 1లక్నో X రాజస్తాన్లక్నో రాత్రి గం. 7.30లకు
మే 2గుజరాత్ X ఢిల్లీఅహ్మదాబాద్ రాత్రి గం. 7.30లకు
మే 3పంజాబ్ X ముంబైమొహాలి రాత్రి గం. 7.30లకు
మే 4లక్నో X చెన్నైలక్నోమ.గం. 3.30లకు
మే 4హైదరాబాద్ X కోల్ కతాహైదరాబాద్ రాత్రి గం. 7.30లకు
మే 5రాజస్తాన్ X గుజరాత్జైపూర్ రాత్రి గం. 7.30లకు
మే 6చెన్నై X ముంబైచెన్నైమ.గం. 3.30లకు
మే 6ఢిల్లీ X బెంగళూరుఢిల్లీ రాత్రి గం. 7.30లకు
మే 7గుజరాత్ X లక్నోఅహ్మదాబాద్మ.గం. 3.30లకు
మే 7రాజస్తాన్ X హైదరాబాద్జైపూర్ రాత్రి గం. 7.30లకు
మే 8 కోల్ కతా X పంజాబ్కోల్ కతా రాత్రి గం. 7.30లకు
మే 9ముంబై X బెంగళూరుముంబై రాత్రి గం. 7.30లకు
మే 10చెన్నై X ఢిల్లీచెన్నై రాత్రి గం. 7.30లకు
మే 11కోల్ కతా X రాజస్తాన్కోల్ కతా రాత్రి గం. 7.30లకు
మే 12ముంబై X గుజరాత్ముంబై రాత్రి గం. 7.30లకు
మే 13హైదరాబాద్ X లక్నోహైదరాబాద్మ.గం. 3.30లకు
మే 13ఢిల్లీ X పంజాబ్ఢిల్లీ రాత్రి గం. 7.30లకు
మే 14రాజస్తాన్ X బంగళూరుజైపూర్మ.గం. 3.30లకు
మే 14చెన్నై X కోల్ కతాచెన్నై రాత్రి గం. 7.30లకు
మే 15గుజరాత్ X హైదరాబాద్అహ్మదాబాద్ రాత్రి గం. 7.30లకు
మే 16లక్నో X ముంబైలక్నో రాత్రి గం. 7.30లకు
మే 17పంజాబ్ X ఢిల్లీధర్మశాల రాత్రి గం. 7.30లకు
మే 18హైదరాబాద్ X బెంగళూరుహైదరాబాద్ రాత్రి గం. 7.30లకు
మే 19పంజాబ్ X రాజస్తాన్ధర్మశాల రాత్రి గం. 7.30లకు
మే 20 ఢిల్లీ X చెన్నైఢిల్లీమ.గం. 3.30లకు
మే 20కోల్ కతా X లక్నోకోల్ కతారాత్రి గం. 7.30లకు
మే 21ముంబై X హైదరాబాద్ముంబైమ.గం. 3.30లకు
మే 21బెంగళూరు  X గుజరాత్బెంగళూరురాత్రి గం. 7.30లకు

ఎక్కడ చూడాలంటే..

బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల్ని స్టార్ట్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. టీవీలో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఈ డిజిటల్ హక్కుల్ని వయోకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఇక.. ఈ సారి హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచుల్ని చూడలేం. కానీ.. అభిమానులు బాధపడాల్సిన పనిలేదు. జియో సినిమా యాప్లో  ఉచితంగా ఐపీఎల్ మ్యాచుల్ని చూడవచ్చు.

First published:

Tags: Chennai Super Kings, Cricket, Gujarat Titans, IPL 2023

ఉత్తమ కథలు