Home /News /sports /

IPL 2022 YOU HIT ONES AND TWOS I CANNOT BAT WITH YOU GLENN MAXWELL MADE SOME INTERESTING COMMENTS ON VIRAT KOHLI SRD

IPL 2022 : 'ఒకటి, రెండు పరుగులు తీసే నీతో బ్యాటింగ్ చేయలేను' .. మ్యాక్స్‌వెల్ ఏంటీ కోహ్లీని ఇలా అనేశాడు..

Virat Kohli - Glenn Maxwell

Virat Kohli - Glenn Maxwell

IPL 2022 : చెన్నైతో జరిగిన మ్యాచులో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) పాలిట విరాట్‌ కోహ్లి(Virat Kohli) విలన్‌గా మారాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కోహ్లి తప్పిదం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2022)లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌ను 13పరుగుల తేడాతో ఓడించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుకు వరుసగా మూడు మ్యాచ్‌ల ఓటములకు బ్రేక్ పడింది. ఆర్సీబీ కీలక టైంలో మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్ విజయంతో ఆ జట్టు ఓటముల పరంపరను అధిగమించడమే కాకుండా 11మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 12పాయింట్లతో లీగ్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకుంది ఆర్సీబీ. అయితే, ఈ మ్యాచులో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) పాలిట విరాట్‌ కోహ్లి(Virat Kohli) విలన్‌గా మారాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కోహ్లి తప్పిదం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతిని కోహ్లి కవర్స్‌ దిశగా ఆడాడు. సింగిల్‌కు అవకాశం లేనప్పటికి.. రావాలా వద్దా అనే సంశయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపుకు కోహ్లి కదిలాడు.

    అయితే కోహ్లి కదలికలను కాస్త ఆలస్యంగా పసిగట్టిన మ్యాక్సీ పరిగెత్తినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే బంతిని అందుకున్న ఊతప్ప ధోనికి త్రో వేశాడు. మ్యాక్స్‌వెల్‌ క్రీజులోకి చేరకముందే ధోని వికెట్లు గిరాటేయడంతో రనౌట్‌ అయ్యాడు. అయితే ఈ సీజన్‌లో కోహ్లి ఒక రనౌట్‌లో భాగస్వామ్యం కావడం ఇది నాలుగోసారి.

    ఇక, ఈ విషయంపై మ్యాచ్ తర్వాత మ్యాక్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నైపై కీలక టైంలో గెలుపొందడంతో డ్రెస్సింగ్‌ రూంలో సందడి నెలకొంది. ఆటగాళ్లంతా ఒక్కచోట చేరి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఓపెనర్‌ విరాట్‌ కోహ్లిని ఆటపట్టించాడు.


    తన రనౌట్‌ను గుర్తుచేస్తూ " అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్‌ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. చాలా అంటే చాలా వేగంగా పరిగెత్తుతావు. ఒకటి, రెండు పరుగులు సాధిస్తావు... కానీ నేను అలా కాదు " అని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, కోహ్లి మాత్రం తనకేమీ పట్టనట్లు.. " ఏంట్రా బాబూ ఇది " అన్నట్లు ముఖం పెట్టి బ్యాట్‌ సర్దిపెట్టుకున్నాడు.

    ఇక, తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక, ఈ మ్యాచులో బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ లో మెరిశాడు. ఆర్సీబీ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసి.. చెన్నై జోరుకు బ్రేకులు వేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Glenn Maxwell, IPL 2022, Royal Challengers Bangalore, Sports, Virat kohli

    తదుపరి వార్తలు