IPL 2022 WILL TAKE PLACE IN INDIA WITH EXTRA NEW TWO TEAMS EVK
IPL 2022 : క్రికెట్ ఫ్యాన్స్ పండగే.. వచ్చే ఐపీఎల్ ఇండియాలోనే..
IPL 2022
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League) 15వ ఎడిషన్‌ను భారత్‌లో నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) కార్యదర్శి జే షా శనివారం ధ్రువీకరించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League) 15వ ఎడిషన్‌ను భారత్‌లో నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) కార్యదర్శి జే షా శనివారం ధ్రువీకరించారు. చెన్నైలో జరిగిన ‘ది ఛాంపియన్స్ కాల్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త జట్ల చేరికతో రాబోయే సీజన్ మరింత ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే సెషన్ ఇండియాలో జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చెపాక్‌లో CSK ఆడటం కోసం మీరంతా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసని ఆయన అన్నారు. ఆ అదర్భుత క్షణం ఎంతో దూరంలో లేదని అన్నారు. ఐపీఎల్ 15వ సీజన్ భారత్‌లో జరగనుందని జే షా స్పష్టం చేశారు.
అంతే కాకుండా త్వరలో మెగా వేలం ఉందని గుర్తు చేశారు. కాబట్టి కొత్త కాంబినేషన్లు ఎలా ఉంటాయో చూడాలని కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నామని జై షా అన్నారు.
అయితే IPL 2021 భారతదేశంలోనే ప్రారంభించబడినప్పటికీ కోవిడ్ వ్యాప్తి కారణంగా టోర్నమెంట్ మధ్యలో రద్దు చేశారు. బయో-బబుల్‌లోని అనేక మంది ఆటగాళ్ళు.. సిబ్బందికి సరైన పరీక్షలు నిర్వహించి లీగ్‌ను వాయిదా వేశారు. అయితే మిగిలిన సీజన్ సెప్టెంబర్-అక్టోబర్‌లో UAEలో నిర్వించారు. ఈ సీజన్‌లో MS ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌లో ఇయాన్ మోర్గాన్ యొక్క కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
అయితే IPL తిరిగి ప్రారంభం కావడానికి ముందే న్యూజిలాండ్‌తో భారత్ సిరీస్ ప్రారంభమైంది. కోవిడ్ గురించి భయపడకుండా అభిమానులు కూడా మెన్ ఇన్ బ్లూ కోసం ఉత్సాహంగా స్టేడియానికి తిరిగి వచ్చారు. ఇక జై షా IPL 2022 గురించి మాట్లాడుతూ, మునుపటి సీజన్‌ల మాదిరిగా కాకుండా, అహ్మదాబాద్, లక్నో అనే రెండు కొత్త ఫ్రాంచైజీలు సీజన్‌లోకి వస్తున్నాయ అన్నారు.
కోవిడ్ నేపథ్యంలో ఇండియా (India), న్యూజీలాండ్ (New Zealand) సిరీస్ సందర్భంగా ఆటగాళ్లందరూ బయోబబుల్‌లో ఉన్నారు. మ్యాచ్ ముందు, తర్వాత జరిగే ప్రెస్ మీట్లను కూడా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇక ప్రేక్షకులను స్టేడియంలోనికి అనుమతించినా.. వాళ్లు బయోబబుల్‌లో ఉన్న వారితో కలవడంపై నిషేధం ఉన్నది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. . టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మ్యాచ్ సమయంలో మైదానంలోకి పరుగులు తీశాడు.
నేరుగా రోహిత్ శర్మ పీల్డింగ్ చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అతడి ముందు మోకరిల్లాడు. పూర్తిగా నేలపై పడుకొని రోహిత్‌కు దండం పెట్టాడు. అతడు రోహిత్ శర్మకు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించినా.. నా పాదాలు తాకొద్దు అని రోహిత్ హెచ్చరించడం టీవీల్లో కనిపించింది. దీంతో స్టేడియంలో సెక్యూరిటీ, పోలీసులు అతడిని పట్టుకొని వచ్చేందుకు అక్కడకు వెళ్లారు. పోలీసులను చూసిన సదరు అభిమాని అక్కడి నుంచి తిరిగి గ్యాలరీల వైపు వెనుకకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మరి ఆ అభిమానిని పోలీసులు అదుపులోనికి తీసుకొని స్టేడియంలో నుంచి బయటకు పంపించేశారు. దీనిపై బీసీసీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.