IPL 2022 WHAT ARE THE CHANCES FOR SUNRISERS HYDERABAD TO MAKING INTO PLAYOFFS OF IPL 2022 SEASON SJN
SRH : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ చేరాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతాలు జరగాల్సిందే!
Sunrisers Hyderabad
SRH : గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ వారంతో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లీగ్ దశకు ఎండ్ కార్డ్ పడనుంది.
SRH : గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ వారంతో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లీగ్ దశకు ఎండ్ కార్డ్ పడనుంది. అయితే ఏ జట్లు ఫ్లే ఆఫ్స్ కు చేరుకుంటాయనేది ఇప్పటికీ చిక్కు ప్రశ్నగానే కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. మిగిలిన జట్లు (ముంబై, చెన్నై తప్ప) ఇంకా రేసులో ఉన్నాయి. ఈ వారంతో ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి.. ఏవి లీగ్ దశతోనే ఇంటి దారి పడతాయో క్లారిటీ వస్తుంది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. అయితే అలా జరగాలంటే మాత్రం అద్భుతాలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 12 మ్యాచ్ ల్లో ఐదు విజయాలు 7 పరాజయాలతో 10 పాయింట్లు సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ తన తదుపరి మ్యాచ్ ల్లో నేడు (మంగళవారం 17మే) ముంబై ఇండియన్స్ తో ఆడాల్సి ఉంది. ఇక చివరి మ్యాచ్ ను ఆదివారం పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తన తదుపరి రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించాల్సి ఉంది. ఆ తర్వాత ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లీగ్ దశలో ఇంకా ఆరు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో రెండు మ్యాచ్ లు సన్ రైజర్స్ ఆడాల్సి ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ కింద చెప్పిన విధంగా ఫలితాలు రావాలి.
మే 17 : ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ : ఫలితం : సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి.
మే 18 : కేకేఆర్ వర్సెస్ లక్నో : ఫలితం : లక్నో సూపర్ జెయిట్స్ గెలవాలి.
మే 19 : ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ : ఫలితం : గుజరాత్ టైటాన్స్ గెలవాలి.
మే 20 : రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ : ఫలితం : ఏదీ గెలిచినా ఓకే.
మే 21 : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ : ఫలితం : ముంబై గెలవాలి.
మే 22 : సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ : ఫలితం : సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి.
పై విధంగా ఫలితాలు వస్తే.. అప్పుడు గుజరాత్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. 12 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. దాంతో నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఢిల్లీ నెట్ రన్ రేట్ హైదరాబాద్, ఆర్సీబీ జట్ల కంటే కూడా ఎక్కువగా ఉంది. అయితే తమ చివరి మ్యాచ్ ల్లో ఆర్సీబీ, ఢిల్లీ జట్లు ముఖ్యంగా ఢిల్లీ భారీ తేడాతో ఓడాలి. అదే సమయంలో తమ చివరి రెండు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. అలా అయితే అప్పుడు హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.