Arjun Tendulkar : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రేపటితో తెరపడబోతుంది. నేటితో ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగో జట్టు ఎదో తేలిపోతుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) రూపంలో మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. నాలుగో స్థానం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య పోటీ నెలకొని ఉంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (Mu,bai Indians) మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు నెగ్గితో ప్లే ఆఫ్స్ ఖాయం అవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇక ముంబై జట్టు చెత్తాటతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆ జట్టు ప్రయోగాల బాట పట్టింది. ప్రతి మ్యాచ్ లోనూ ఇద్దరు కొత్త ప్లేయర్స్ కు అవకాశం ఇస్తూ తమ బెంచ్ ను పరీక్షిస్తోంది. మరోవైపు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఈ మ్యాచ్ లో ఆడించాలంటూ ముంబై ఫ్యాన్స్ తో పాటు సచిన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. జట్టుతో ఉంటున్నా అతడికి ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా ఇవ్వక పోవడం మంచిది కాదని.. అర్జున్ కు ఒక అవకాశం ఇస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇకపై బెంచ్ ను పరీక్షిస్తామని చెప్పాడు. చివరి మ్యాచ్ లో కూడా కొత్త ప్లేయర్స్ కు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీ తో జరిగే మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం. ఇక ఈ మ్యాచ్ కోసం అర్జున్ నెట్స్ లో చెమటలు కక్కుతున్నాడు. యార్కర్లతో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మలింగ మాదిరి వికెట్ల ముందు షూ పెట్టి.. యార్కర్లను ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై టీవీ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఇందులో అర్జున్ టెండూల్కర్ యార్కర్లను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మొత్తం మూడు బంతులను వేయగా.. అందులో మొదటి బంతి వికెట్లను తాకకుండా వెళ్తుంది. ఇక రెండో బంతి మాత్రం లెగ్ స్టంప్ ను ఎగిరిపోయేలా చేస్తోంది. షూను టార్గెట్ చేస్తూ మూడో బంతి వేయగా.. బాల్ షూను తగలగానే వెళ్లి వికెట్లను తాకుతుంది. ఈ క్రమంలో రెండు వికెట్ టేకింగ్ బంతులను వేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi Capitals, IPL, IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Sachin Tendulkar