Home /News /sports /

IPL 2022 VIRENDER SEHWAG SLAMS BCCI OVER POWER CUT PROBLEM DENIED REVIEWS IN CSK VS MI MATCH SRD

Virender Sehwag : పవర్ కట్ పై సెహ్వాగ్ సీరియస్.. బీసీసీఐకి గట్టిగానే ఇచ్చాడు.. !

వీరేంద్ర సెహ్వాగ్​ (ఫైల్​ ఫొటో)

వీరేంద్ర సెహ్వాగ్​ (ఫైల్​ ఫొటో)

Virender Sehwag : IPL 2022 : ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs MI) మధ్య జరిగిన ఘటన ఐపీఎల్, బీసీసీఐ పరువు దిగజారేలా చేసింది. దీనిపై ఫ్యాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు.

  ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. కామధేనువులా మారిన ఐపీఎల్.. బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే.. తాజాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs MI) మధ్య జరిగిన ఘటన ఐపీఎల్, బీసీసీఐ దిగజారేలా చేసింది. ప్రపంచ క్రికెట్ లో ఫేమస్ లీగ్ లో పవర్ కట్ సమస్య వల్ల ఫలితం తారుమారు అయింది. దీంతో.. అభిమానులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐపై మండిపడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేరిపోయాడు. కొంచెమన్న సిగ్గుండాలన్న రీతిలో ప్రశ్నల పరంపరతో బీసీసీఐని కడిగిపారేశాడు.

  వివరాల్లోకెళితే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్‌ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది.చివరకు పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది.

  డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించాడు. ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి.అయితే పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు... టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది.

  ఇది కూడా చదవండి : కీలక సమయంలో KKRకి భారీ షాక్.. టోర్ని నుంచి రూ.7.5 కోట్ల ఆటగాడు ఔట్..

  దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా.. రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి.

  ఈ వివాదంపై సెహ్వాగ్ స్పందిస్తూ.. మ్యాచ్‌లో పవర్ కట్ వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద లీగ్‌లో ఒక జనరేటర్‌ను కూడా ఉపయోగించలేరా..? డీఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ కోసం జనరేటర్ ద్వారా పవర్ బ్యాకప్ పెట్టుకోలేరా? జనరేటర్లను ఉపయోగించకపోవడమేంటో అర్థం కావట్లేదు. ఐపీఎల్ నిర్వహణలో ఇలా వ్యవహరించడం పట్ల బీసీసీఐకి ఇది పెద్ద ప్రశ్న రేకెత్తించిందంటూ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు.

  పవర్ కట్ అయినంతా మాత్రానా మ్యాచ్ జరగలేదా.. స్టేడియం లైట్లు వెలగలేవా, బ్రాడ్‌కాస్టర్లకు ప్రసారాలు జరగలేవా, వీటన్నింటికీ లేని పవర్ సమస్య కేవలం డీఆర్ఎస్‌కు మాత్రమే పవర్ ఇష్యూ ఏంటీ..? మ్యాచ్ జరుగుతుంటే కచ్చితంగా డీఆర్‌ఎస్‌ వాడాలి.. లేదంటే ఆ మ్యాచ్ మొత్తం డీఆర్‌ఎస్‌ వాడకూడదు. ఇది నిజంగా చెన్నైకి వ్యతిరేకమైంది అని సెహ్వాగ్ బీసీసీఐపై ఫైరయ్యాడు. ఒకవేళ ఇది ఫైనల్ లో జరిగి ఉంటే బీసీసీఐ పరువు ఇంకా దిగజారి ఉండేదని వ్యాఖ్యానించాడు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Rohit sharma, Virender Sehwag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు