RCB : రెండు జట్లు గ్రౌండ్ లో హోరాహోరీగా తలపడుతుంటే కళ్లార్పకుండా ఉత్కంఠగా చూడటం సాధారణమైన విషయం. అదే ఒక జట్టు ఒక మ్యాచ్ ను చూస్తుంటే.. ఆ చూసే జట్టు రియాక్షన్ ను ఉత్కంఠగా చూసేలా చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore). అవును.. తాము ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ ను ఆర్సీబీ టీం మొత్తం కళ్లార్పకుండా చూసింది. మ్యాచ్ మధ్యలో అంతరాయం వచ్చి టీవీలో లైవ్ ఆగిపోతే.. వెంటనే వేరే టీవీ కోసం విరాట్ కోహ్లీ (Virat Kohli)తో సహా టీం మొత్తం పరుగెత్తింది. సాధారణ ప్రేక్షకులు ఒక క్రికట్ మ్యాచ్ ను ఎలా చూస్తారో అదే విధంగా ఆర్సీబీ జట్టు ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను చూసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.
ఇక మ్యాచ్ ముందు నుంచే కూడా ఆర్సీబీ జట్టు ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. దినేశ్ కార్తీక్ అయితే గతంలో ముంబై కు ఆడిన సమయంలోని ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ముంబై జట్టుకు మద్దతు పలికాడు. ఇక మ్యాచ్ ను ఆరంభం నుంచి ముగింపు వరకు ఆర్సీబీ టీం మొత్తం కళ్లార్పకుండా చూసింది. ఢిల్లీ వికెట్లు పడితే కేరింతలు కొట్టడం.. అదే సమయంలో ముంబై ఆరంభంలో నెమ్మదిగా ఆడితే బాధపడటం చేసింది. ఇక టిమ్ డేవిడ్ విధ్వంసానికి అయితే విరాట్ కోహ్లీ పంజాబీ స్టయిల్ లో డ్యాన్స్ చేశాడు. ఇక ఆఖర్లో ముంబై గెలవగానే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ జట్టు మొత్తం తామే గెలిచినంతగా సంబరాలు చేసుకున్నారు.
RCB qualified for the playoffs for the third consecutive year. We bring to you raw emotions, absolute joy and post-match celebrations, as the team watched #MIvDC. This is how much it meant to the boys last night.@kreditbee#PlayBold #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/5lCbEky8Xy
— Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2022
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రొవెమన్ పావెల్ (34 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (33 బంతుల్లో 39 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. తన అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ జోరుకు బ్రేకులు వేశాడు. రమణ్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్స్, మార్కండే చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ (33 బంతుల్లో 37 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ ( 17 బంతుల్లో 21 పరుగులు ; 1 ఫోర్, 1సిక్సర్) మెరుపులు మెరిపించడంతో ఈ సీజన్ ను ముంబై సూపర్ విక్టరీతో ముగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Mohammed Siraj, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Royal Challengers Bangalore, Virat kohli