IPL 2022 సీజన్ 67వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి టోర్నీలో ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచింది. ఇక, RCB విజయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)దే కీ రోల్. ఈ మ్యాచ్‌లో అదిరిపోయే బ్యాటింగ్ తో RCBకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో ఫ్యాన్స్ పాత కోహ్లీని చూశారు. బ్యాటింగ్ , ఫీల్డింగ్‌లోనూ తన దూకుడు ప్రదర్శించాడు. మైదానంలో దిగిన తర్వాత విరాట్ కోహ్లీ టెంపర్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు, మాటల్లోనూ, చేతల్లోనూ కోహ్లీ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా సరే లెక్కచేయని మనస్తత్వం కోహ్లీది. మాటకు మాట బదులివ్వడం, మైదానంలో గొడవకు దిగేందుకైనా వెనుకాడకపోవడం కోహ్లీ నైజం.
ఇక, ఈ మ్యాచులో కూడా గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్ మాన్ గిల్ పై కోహ్లీ స్లెడ్జింగ్ కు దిగాడు. గిల్ ను చూస్తూ "పీక కోస్తా" అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అచ్చం... డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్ లో అండర్ టేకర్(Under Taker) చేసినట్టు చేశాడు. దాంతో గిల్ కూడా కోహ్లీ వైపు సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : సచిన్ కి రోహిత్ వెన్నుపోటు.. గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఇదేనా..!
ఇక, ఈ మ్యాచ్ కు ముందు వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చెత్త ఫామ్ తో అందరి చేత విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ పరుగుల కోసం నానా కష్టాలు పడ్డాడు. ఈ సీజన్ లో పేలవ బ్యాటింగ్‌తో సతమతమైన కింగ్.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ మరోసారి ఛేజింగ్ కింగ్ గా నిలిచాడు.
— ChaiBiscuit (@Biscuit8Chai) May 20, 2022
ఇక, విరాట్ బ్యాట్ నుంచి పరుగులు రావడంతో అతని పేరిట రికార్డుల మోత కూడా మోగింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్రతీ సీజన్లో వరుసగా 300కు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో 12 సీజన్లలో 300+ పరుగులు చేసిన సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను అధిగమించి, టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా గెలిచాడు. విరాట్ ఈ ఫీట్ సాధించడం 13వ సారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Gujarat Titans, IPL 2022, Royal Challengers Bangalore, Viral Video, Virat kohli