Home /News /sports /

IPL 2022 VIRAT KOHLI VS ROHIT SHARMA VIRAT KOHLI BEAT ROHIT SHARMA BY MASSIVE MARGIN IN IPL FANS POLL SJN

IPL 2022: రోహిత్ ను చిత్తు చిత్తుగా ఓడించిన విరాట్ కోహ్లీ... ఎందులో అంటే?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఫైల్ ఫోటోస్)

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఫైల్ ఫోటోస్)

IPL 2022: ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఇద్దరూ ఇద్దరే.  ఒంటి చేత్తో విజయాలను అందించడంలో వీరికి వీరే సాటి. గతంలో టీమిండియా (Team India)ను విరాట్ కోహ్లీ నడిపిస్తే... ఇప్పుడు రోహిత్ శర్మ ఆ బాధ్యత తీసుకున్నాడు.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఇద్దరూ ఇద్దరే.  ఒంటి చేత్తో విజయాలను అందించడంలో వీరికి వీరే సాటి. గతంలో టీమిండియా (Team India)ను విరాట్ కోహ్లీ నడిపిస్తే... ఇప్పుడు రోహిత్ శర్మ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కాస్త కష్టమే అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథిగా రోహిత్ కొనసాగుతుంటే... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)లో కీలక ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తుంటే... రోహిత్ మాత్రం ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు.

శనివారం నాడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా... విరాట్ కోహ్లీ టీం రోహిత్ టీంపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో రోహిత్ శర్మ 26 పరుగులు చేస్తే... కోహ్లీ 48 పరుగులు చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... నిన్న మ్యాచ్ జరిగే సమయంలో ఓ ఆసక్తికర ప్రశ్నను ఐపీఎల్ తమ ఫ్యాన్స్ ముందు ఉంచింది. ఫ్యాన్స్ పోల్ లో భాగంగా... ఏ ఇండియన్ ప్లేయర్ స్టయిలిష్ స్ట్రోక్ ప్లేయర్? అనే ప్రశ్నను అడిగి... ఆప్షన్స్ గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లను ఇచ్చింది. కాసేపటి తర్వాత పోల్ ఫలితాలను ప్రకటిస్తే ఆశ్యర్యకర విషయం వెల్లడి అయ్యింది.



72 శాతం మంది అభిమానులు విరాట్ కోహ్లీని ఇండియన్ స్టయిలిష్ స్ట్రోక్ ప్లేయర్ బ్యాటర్ గా పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ అయితే కేవలం 28 శాతంతో కోహ్లీ దరిదాపుల్లో కూడా నిలువలేకపోయాడు. ఈ ఫలితం రాకముందు వరకు కూడా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావిస్తే... రిజల్ట్ చూస్తే... రోహిత్ ను కోహ్లీ చిత్తు చిత్తుగా ఓడించాడని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ ( 37 బంతుల్లో 68 పరుగులు ; 5 ఫోర్లు,6 సిక్సర్లు ) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేజింగ్ కు దిగిన బెంగళూరు టీం 18.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసి గెలుపొందింది. అనూజ్ రావత్ ( 47 బంతుల్లో 66 పరుగులు ; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ( 36 బంతుల్లో 48 పరుగులు ; 5 ఫోర్లు) రాణించాడు. సీజన్ లో బెంగళూరుకు ఇది హ్యాట్రిక్ విజయం కాగా... ముంబై జట్టుకు వరుసగా నాలుగో పరాజయం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Glenn Maxwell, IPL, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు