IPL 2022 VIRAT KOHLI SUPPORTS MUMBAI INDIANS AGANIST DELHI CAPITALS FIGHT FOR THIS REASON AND FAF DUPLESIS ALSO SRD
IPL 2022 : అడగక అడగక రోహిత్ ను ఓ కోరిక కోరిన కోహ్లీ.. మరి, హిట్ మ్యాన్ ఏం చేస్తాడో..!
Virat Kohli - Rohit Sharma
IPL 2022 : 8 విజయాలు 16 పాయింట్లతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ జట్టు నెట్‌రన్‌రేట్ (-0.253) తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ ఓ కోరిక కోరాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 సీజన్ ప్లే ఆఫ్స్ కథ తారా స్థాయికి చేరుకుంది. 10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 ఊహకందని ట్విస్ట్ లతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. తాజాగా ఆర్సీబీ (RCB) విక్టరీతో పంజాబ్ (Punjab Kings), హైదరాబాద్ (Sunrisers Hyderabad) అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించాయ్. దీంతో.. కోల్ కతా, ముంబై, చెన్నైల సరసన ఈ రెండు జట్లు కూడా చేరాయ్. తమ చివరి మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది ఆర్సీబీ. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్‌కు ఉన్న అడ్డంకి ఒకే ఒక జట్టు.. ఆ టీమే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఈ రిషభ్ పంత టీమ్.. ఇంకో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్- ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంటుంది.
ముంబై మ్యాచులో ఢిల్లీ నెగ్గితే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో నాలుగో బెర్త్ ను దక్కించుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ నెట్ రన్ రేట్ ప్లస్ లో ఉంది. ముంబై మీద గెలిస్తే.. నెట్ రన్ రేట్ మరింత మెరగవ్వడం ఖాయం. ప్రస్తుతం ఢిల్లీ ఖాతాలో ఉన్న పాయింట్లు.. 14. ముంబై ఇండియన్స్‌పై ఓడిపోతే- అక్కడితోనే దాని ప్రస్థానం ఆగిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే మాత్రం- బెంగళూరుకు బెంగ ఉండదు. ప్రస్తుతం బెంగళూరు నెట్ రన్‌రేట్ -0.253 కాగా, ఢిల్లీది 0.255.
8 విజయాలు 16 పాయింట్లతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ జట్టు నెట్‌రన్‌రేట్ (-0.253) తక్కువగా ఉంది. దాంతో ఏడు విజయాలతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే మెరుగైన రన్‌రేట్ (0.255) ఉన్న కారణంగా ఆర్‌సీబీ వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ముంబై గెలిస్తే ఆర్సీబీకి ఛాన్స్ దక్కుతుంది. దీంతో.. ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు.
ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్‌లే స్వయంగా వెల్లడించారు. తాము ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులుగా మారిపోయామని, రోహిత్ సేనకే తమ మద్దతని ప్రకటించారు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్, ఫాఫ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్పోర్ట్స్‌తో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇప్పుడు ముంబై గెలవాలని, అందుకోసం తాము ఇద్దరం మద్దతు తెలియజేస్తామని చెప్పాడు.
ఆ వెంటనే తాము ఇద్దరమే కాకుండా తమ జట్టులోని 25 మంది మద్దతు కూడా ముంబై ఇండియన్స్‌కే ఉంటుందన్నాడు. వీలైతే తమని ముంబై, ఢిల్లీ మ్యాచ్‌లో రోహిత్ సేన అభిమానులుగా చూడొచ్చని కూడా చెప్పాడు. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్.. ముంబై, ముంబై అంటూ అరిచాడు. ఈ వీడియోను టోర్నీ నిర్వాహకులు అభిమానులతో పంచుకోగా వైరల్ అయింది. మరి, కోహ్లీ అడగక అడగక అడిగిన కోరికను రోహిత్ నెరవేరుస్తాడో లేదో తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.