Home /News /sports /

IPL 2022 VIRAT KOHLI SUPER CATCH ANUSHKA SHARMA REACTION FOR VIRAT KOHLI SINGLE HAND CATCH GOES VIRAL SJN

IPL 2022: ఒంటి చేత్తో అలా గాల్లోకి ఎగిరి.. గ్రౌండ్ లో కోహ్లీ అద్భుత క్యాచ్.. అదిరిపోయే రియాక్షన్ ఇచ్చిన అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (PC: TWITTER)

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (PC: TWITTER)

Virat Kohli Super catch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మెరిశాడు. బ్యాటింగ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఫీల్డింగ్ లో మాత్రం కేక పెట్టించాడు.

ఇంకా చదవండి ...
Virat Kohli Super catch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మెరిశాడు. బ్యాటింగ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఫీల్డింగ్ లో మాత్రం కేక పెట్టించాడు. అద్భుత క్యాచ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సారథి రిషభ్ పంత్ (Rishabh Pant)ను పెవిలియన్ కు చేర్చాడు. ఒకరకంగా ఈ క్యాచే  మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. ఈ క్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ గాడి తప్పింది. ఆ విధంగా మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ తో విరాట్ కోహ్లీ మెరిశాడు. ఫలితంగా ఢిల్లీ పై ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ ఆసక్తిగా సాగుతున్న వేళ.. 17వ ఓవర్ వేయడానికి మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. అప్పటికి రిషభ్ పంత్  17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరాజ్ వేసిన మూడో బంతిని పంత్ షాట్ ఆడే ప్రయత్నం  చేయగా.. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ తల మీదుగా బంతి వెళ్లింది. అయితే కోహ్లీ క్షణకాలంలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి మరీ..



క్యాచ్ అందుకున్న కోహ్లీని జట్టు సభ్యులు చుట్టుముట్టి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తోన్న అనుష్క శర్మ తన భర్త క్యాచ్ ను చూసి మురిసిపోయింది. క్యాచ్ తర్వాత కోహ్లీ అనుష్క శర్మకు అభివాదం చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



ఇక మ్యాచ్ లో బెంగళూరు జట్టు 16 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం  సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్ వెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ప్రత్యర్థులను దంచి కొట్టారు. ఛేజింగ్ లో డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రిషభ్ పంత్ (17 బంతుల్లో 34;  3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయం కోసం పోరాడారు.  ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Anushka Sharma, David Warner, Delhi Capitals, Glenn Maxwell, IPL, IPL 2022, Rishabh Pant, Royal Challengers Bangalore, Virat kohli

తదుపరి వార్తలు