హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli: 'ఊ అంటావా మావ'.. సమంత పాటకు విరాట్ కొహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్

Virat Kohli: 'ఊ అంటావా మావ'.. సమంత పాటకు విరాట్ కొహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్

సమంత, విరాట్ కొహ్లీ

సమంత, విరాట్ కొహ్లీ

IPL 2022: ఐపీఎల్ 2022లో పేలవ ప్రదర్శనతో విరాట్ కొహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రన్ మెషీన్ అని గతంలో కొనియాడిన వారే.. ఇప్పుడు తిడుతున్నారు. ఈ ఐపీఎల్‌ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో విరాట్ కొహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు.

  ఐపీఎల్‌ (IPL 2022)లో విరాట్ కొహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ రన్ మెషీన్‌కు ఏమైంది? మునుపటిలా పరుగుల వరద ఎందుకు పారించలేకపోతున్నాడని అందరిలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సీజన్‌లో కొహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. బ్యాట్‌ను ఝులిపించలేకపోతున్నాడు. ఇలాగైతే కష్టమని..అందరూ చర్చించుకుంటున్న వేళ.. విరాట్ కొహ్లీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప (Pushpa Movie) సినిమాలోని సమంత (Samantha) ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ.. సాంగ్‌కి కింగ్ కొహ్లీ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఆ వీడియో నెట్టింట్లో రచ్చచేస్తోంది.

  Virat Kohli : కోహ్లీ కథ ముగిసినట్లేనా.. ఇలానే ఆడితే టి20 ప్రపంచ కప్ జట్టులో చోటు కష్టమే మరీ..


  IPL 2022లో బయో బబుల్ మధ్య కూడా ఆటగాళ్లు చాలా సరదాగా గడుపుతున్నాడు. గ్రౌండ్‌లో సిక్స్‌లు మోత మోగించే ఆటగాల్లు.. గ్రౌండ్ బయట చాలా సరదాగా ఉంటున్నారు. బుధవారం (ఏప్రిల్ 27).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాహ వేడుక (Glenn maxwell wedding event) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు సందడి చేశారు. ఆటపాటలతో దుమ్మురేపారు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. నల్ల కుర్తా పైజామా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. షాబాజ్ అహ్మద్, RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి మాక్స్‌వెల్ వెడ్డింగ్ ఈవెంట్‌లో రచ్చ రచ్చ చేశాడు కొహ్లీ. అందరూ కలిసి డాన్స్‌లు చేశారు. ముఖ్యంగా విరాట్ కొహ్లీ.. షాబాజ్ అహ్మద్‌తో కలసి ' ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా..'' పాటకు స్పెప్పులు వేశాడు. విరాట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  కాగా, ఐపీఎల్ 2022లో పేలవ ప్రదర్శనతో విరాట్ కొహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రన్ మెషీన్ అని గతంలో కొనియాడిన వారే.. ఇప్పుడు తిడుతున్నారు. ఈ ఐపీఎల్‌ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో విరాట్ కొహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నుంచి వైదొలగాలని పలువురు క్రికెట్ నిపుణులు విరాట్ కోహ్లీకి సలహా ఇస్తున్నారు. అయినప్పటికీ RCB టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై పూర్తి విశ్వాసం ఉంచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించిది. ఐనా కొహ్లీ ఆట మారలేదు. కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే కొహ్లీపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇలాగైతే టీమిండియా జట్టులో చోటు దొరకడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  ఆ ఫ్రాంచైజీలు నాకు నమ్మక ద్రోహం చేశాయి..‘ ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సంచలన కామెంట్స్


  నవంబర్ 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు విరాట్ కొహ్లీ. వరల్డ్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 70 సెంచరీలు చేసిన అతడు.. బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో చివరిసారిగా సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి కొహ్లీ బ్యాట్నుంచి పరుగులు రావడం లేదు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, IPL 2022, Pushpa Movie, Virat kohli

  ఉత్తమ కథలు