హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : ’దండాలయ్యా దండాలయ్యా‘.. డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ను కోహ్లీ ఎలా గౌరవించాడో చూడండి

Virat Kohli : ’దండాలయ్యా దండాలయ్యా‘.. డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ను కోహ్లీ ఎలా గౌరవించాడో చూడండి

దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లీ (PC : TWITTER)

దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లీ (PC : TWITTER)

Virat Kohli - Dinesh Karthik : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భారత వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఒక సంచలనం. గతేడాది వరకు కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు తరఫున ఆడిన అతడిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

Virat Kohli - Dinesh Karthik : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భారత వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఒక సంచలనం. గతేడాది వరకు కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు తరఫున ఆడిన అతడిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఏబీ డీవిలియర్స్ పోషించిన ఫినిషర్ రోల్ బాధ్యతలను తీసుకున్న దినేశ్ కార్తీక్.. అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చి తక్కువ బంతుల్లో 200 ప్లస్ స్ట్రయిక్ రేట్ తో ఆడుతూ ఆర్సీబీకి భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు విజయాల్లోనూ దినేశ్ కార్తిక్ దే ప్రముఖ పాత్ర.

ఇది కూడా చదవండి : ’ఆకలేస్తే ఫుడ్ తినాలి ధోని.. బ్యాట్ ని కాదు..‘ తలా వింత ప్రవర్తనకు షాక్ లో ఫ్యాన్స్

ఇక ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 8 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఒక ఫోర్ నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఫరూకి వేసిన ఆఖరి ఓవర్లో చివరి నాలుగు బంతులను వరుసగా 6, 6, 6, 4 బాదిన కార్తిక్.. 375 స్ట్రయిక్ రేట్ తో తన ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూంకు చేరుకున్న అతడిని విరాట్ కోహ్లీ తనదైన స్టయిల్ లో గౌరవించాడు. దినేశ్ కార్తీక్ డోర్ తీసుకొని లోపలికి రాగానే.. టేక్ ఏ బౌ అంటూ దండాలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ పై  ఆర్సీబీ 67 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (50 బంతుల్లో 73 పరుగులు నాటౌట్ ; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్ పాటిదార్ ( 38 బంతుల్లో 48 పరుగులు ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్ వెల్ (24 బంతుల్లో 33 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దినేష్ కార్తీక్ ( 8 బంతుల్లో 30 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్ 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.  సుచిత్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన సన్‌రైజర్స్‌ బౌలర్‌ జగదీశ సుచిత్‌ మొదటి బంతికే వికెట్‌ తీశాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి డకౌట్‌ అయ్యాడు. విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. విరాట్ కోహ్లీకి ఈ సీజన్ లో ఇది మూడో గోల్డెన్ డకౌట్. అయితే.. కోహ్లీ డకౌట్ ఆర్సీబీ బ్యాటింగ్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు  19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Kane Williamson, Mohammed Siraj, RCB, Royal Challengers Bangalore, SRH, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు