IPL 2022 ఛాంపియన్ ఎవరనదే 2 మ్యాచ్‌ల తర్వాత నిర్ణయించబడుతుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. 72 మ్యాచ్‌ల తర్వాత, గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయ్. ఇక, ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం (మే 25) ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో గెలుపు వాకిట బొక్కాబోర్లా పడిన లక్నో.. 15వ సీజన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గెలిచిన బెంగళూరు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, ఎలిమినేటర్ మ్యాచ్ విజయాన్ని ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బాగా ఆస్వాదించాడు.
మ్యాచ్‌లో నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి కాసేపు రజత్ పాటిదార్ ఇన్నింగ్స్‌ని ఎంజాయ్ చేసిన కోహ్లీ.. అనంతరం ఆర్సీబీ డగౌట్‌లో కూర్చుని పాటిదార్ శతకాన్ని బాగా ఆస్వాదించాడు. అలానే ఫీల్డింగ్ చేస్తూ ఆర్సీబీ బౌలర్ తీసిన ప్రతి వికెట్‌కీ గాల్లోకి పంచ్‌లు విసురుతూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో బాలయ్య బాబు స్టైల్ లో తొడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక.. తన కెరీర్ లోనే రజత్ పాటీదార్ ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని కుర్రాడిని ప్రశంసల్లో ముంచెత్తాడు కోహ్లీ.
ఇది కూడా చదవండి : గబ్బర్ ని చితకబాదిన అభిమాని..పక్కన పోలీస్ ఉన్నా లెక్క చేయలేదు.. పాపం శిఖర్..
ఇక, ఫైనల్ కు చేరిన గుజరాత్ జట్టు రాజస్థాన్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడనుంది. IPL టైటిల్ రేసులో ఇంకా రెండు జట్టు ఉన్నప్పటికీ.. కప్ గెలవడం ఆర్సీబీకి ఎంతో కీలకం. 15 ఏళ్ల చరిత్రలో ఆర్సీబీ ఇంతవరకు కప్ నెగ్గలేదు. ఈ సారి నాలుగో స్థానంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది.
ఇప్పుడు, పాయింట్ల పట్టికలో రెండో ర్యాంక్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మరియు మొదటి ర్యాంక్ గుజరాత్ టైటాన్స్‌లను అధిగమించి కప్ గెలవాల్సి ఉంది. ఇక, శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ (RR)తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌ని బెంగళూరు ఆడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఫైనల్లో అడుగుపెట్టనుంది. మరోవైపు ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో టీమ్ ఇంటిబాట పట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Lucknow Super Giants, Rajasthan Royals, Royal Challengers Bangalore, Viral Video, Virat kohli