హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: కోపంతో శివతాండవం చేసిన కోహ్లీ... ఈసారి ఏకంగా థర్డ్ అంపైర్ పైనే..!

IPL 2022: కోపంతో శివతాండవం చేసిన కోహ్లీ... ఈసారి ఏకంగా థర్డ్ అంపైర్ పైనే..!

IPL 2022: విరాట్ కోహ్లీ (Virat Kohli) అంటేనే దూకుడుకు మారు పేరు. క్రికెట్ లో టీమిండియా (Team India)కు దూకుడు మంత్రాన్ని బోధించింది కూడా కోహ్లీనే అంటారు అతడి అభిమానులు. సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మైదానంలో దూకుడుగా ఉన్నా... అది కోహ్లీ అంత కాదని సుస్ఫష్టం.

ఇంకా చదవండి ...

IPL 2022: విరాట్ కోహ్లీ (Virat Kohli) అంటేనే దూకుడుకు మారు పేరు. క్రికెట్ లో టీమిండియా (Team India)కు దూకుడు మంత్రాన్ని బోధించింది కూడా కోహ్లీనే అంటారు అతడి అభిమానులు. సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మైదానంలో దూకుడుగా ఉన్నా... అది కోహ్లీ అంత కాదని సుస్ఫష్టం. మైదానంలో ఆటతోనే కాకుండా మాటతోనూ బదులివ్వడంతో కోహ్లీ ముందుంటాడు. అందుకే ఇతడితో జగడం అంటే ప్రత్యర్థి ప్లేయర్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అయితే గత రెండేళ్లుగా కోహ్లీ దూకుడు కాస్త తగ్గిందనే చెప్పాలి. తొలుత ఉన్నంత దూకుడుగా అయితే లేడు. అదే సమయంలో కెప్టెన్సీ కోల్పోవడం... మూడు ఫార్మాట్లలోనూ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోవడంతో అతడు చాలా ఒత్తిడిలో ఉన్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో తనలోని పాత కోహ్లీని మరోసారి పరిచయం చేశాడు. అయితే ఈసారి ఆటగాళ్లపై కాదు.. ఏకంగా థర్డ్ అంపైర్ పైనే...

ఇది కూడా చదవండి : ఏంది రోహిత్ బాయ్ అంత మాట అనేశావ్..! తమరి జట్టు సత్తా అంతేనా?

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. అయితే డివాల్డ్ బ్రేవిస్ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని కోహ్లీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అప్పుడు బంతి ప్యాడ్లకు తగలడంతో బౌలర్ అప్పీల్ చేశాడు. అంపైర్ కోహ్లీని అవుట్ గా ప్రకటించగా... విరాట్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలో బంతి విరాట్ కోహ్లీ బ్యాట్, ప్యాడ్ లకు ఒకేసారి తగిలినట్లు కనిపించింది. అయితే బ్యాట్ ప్యాడ్ కంటే కాస్త ముందుగా ఉంది. దాంతో అది నాటౌట్ గా ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే థర్డ్ అంపైర్ మాత్రం ’బెన్ ఫిట్ ఆఫ్ ద డౌట్‘ కింద ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి కోహ్లీని అవుట్ గా ప్రకటించాడు.

తాను నాటౌట్ అయినా అవుట్ గా ప్రకటించారనే కోపంతో కోహ్లీ ఊగిపోయాడు. పెవిలియన్ కు చేరే క్రమంలో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కొంత మంది అభిమానులు థర్డ్ అంపైర్ నిర్ణయం తప్పంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అదే సమయంలో ఎల్బీడబ్ల్యూ రూల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బంతి ఒకేసారి బ్యాట్, ప్యాడ్ లకు తగిలినట్లు తేలితే... బ్యాటర్ కు ఫేవర్ గా నిర్ణయం రావాలని రూల్స్ లో ఉందంటూ దానికి సంబంధించిన 36.2.2 నిబంధనను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 2 పరుగులతో అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే మ్యాచ్ లో బెంగళూరు 7 వికెట్లతో గెలిచింది. ఈ సీజన్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాలపై దుమారం చెలరేగడం సర్వ సాధారణంగా మారింది.

First published:

Tags: Glenn Maxwell, IPL, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు