IPL 2022 : ఇండియాలో క్రికెట్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎందరో ఉంటారు. ఇక తమ పేవరెట్ ప్లేయర్ కోసం ఏం చేయడానికైనా సరే రెడీ అయిపోతారు. తాజాగా ఇటువంటి సంఘటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో చోటు చేసుకుంది. కోల్ కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), లక్నోసూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యచ్ జరుగుతున్న సమయంలో ఓ అకతాయి అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఫేవరెట్ ప్లేయర్ ను గ్రౌండ్ లో కలిసి వైరల్ అయిపోవాలని చూశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో అతడి ప్లాన్ పూర్తిగా దెబ్బతింది.
లక్నో జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ అకతాయి అభిమాని ఉన్నపళంగా మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వెంటనే మైదనాంలోకి దూసుకొచ్చి ఆ ఆకతాయి అభిమాని పని పట్టారు. ఏకంగా తుంటిరి ఫ్యాన్ ను తన భుజంపైన వేసుకున్న ఓ పోలీస్.. గ్రౌండ్ ను బయటకు తీసుకెళ్లాడు. ఇదంతా చాలా దగ్గర నుంచి చూసిన కోహ్లీ షాక్ గురయ్యాడు. అనంతరం కోహ్లీ కూడా పోలీసులో ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@KolkataPolice Police rocks @imVkohli Kohli ka reaction best 👌🔥#RCBVSLSG #LSGvRCB#yesterdaynight #IPLPlayOffs2022 pic.twitter.com/gkWJa7grkA
— SOHAM MISHRA (@SohamMishra7) May 26, 2022
Intruder in yesterday's match.
Kohli 🤣 pic.twitter.com/1CiQXZTDdm
— Samy (@ZlxComfort) May 26, 2022
పోలీస్ రాక్స్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ రియాక్షన్ బెస్ట్ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి అకతాయి అభిమానులు దూసుకురావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. మొన్నటి వరకు విదేశీ గడ్డలపై ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపించగా.. తాజాగా అది భారత్ లోనూ పాకింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన ఆర్సీబీ జట్టు క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన రాజస్తాన్ రాయల్స్ తో ఆర్సీబీ తలపడనుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Faf duplessis, Gautam Gambhir, Glenn Maxwell, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, RCB, Royal Challengers Bangalore, Virat kohli