IPL 2022 VIRAL NEWS KOLKATA KNIGHT RIDERS ALL ROUNDER ANDRE RUSSELL HUGE SHOT BREAKS CHAIR IN PRACTICE SESSION VIDEO GOES VIRAL SJN
IPL 2022 : వామ్మో రస్సెల్.. ఈ విండీస్ వీరుడు కొడితే ఏదైనా సరే విరగాల్సిందే.. వీడియో వైరల్
రస్సెల్ షాట్ కు విరిగిపోయిన చైర్ (PC: INSTAGRAM)
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వెస్టిండీస్ (WestIndies) ప్లేయర్స్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర దేశాల క్రకెటర్లకు ఉండదు. ప్రతి ఐపీఎల్ జట్టు కూడా కనీసం ఒక్క వెస్టిండీస్ ప్లేయర్ నైనా తమతో పాటు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఐపీఎల్ లో దాదాపుగా అన్ని జట్లల్లోనూ కరీబియన్ ప్లేయర్స్ కీ రోల్ ప్లే చేస్తుంటారు.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వెస్టిండీస్ (WestIndies) ప్లేయర్స్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర దేశాల క్రకెటర్లకు ఉండదు. ప్రతి ఐపీఎల్ జట్టు కూడా కనీసం ఒక్క వెస్టిండీస్ ప్లేయర్ నైనా తమతో పాటు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఐపీఎల్ లో దాదాపుగా అన్ని జట్లల్లోనూ కరీబియన్ ప్లేయర్స్ కీ రోల్ ప్లే చేస్తుంటారు. వారికి ఉండే భారీ హిట్టింగ్ ఎబిలిటీతో పాటు బౌలింగ్ చేసే నైపుణ్యం వారికి ఐపీఎల్ లో అంత క్రేజ్ తీసుకురావడానికి దోహదం చేశాయి. క్రిస్ గేల్ (chris gayle)తో మొదలు కొని పొలార్డ్ (kieron pollard), బ్రావో, ఆండ్రీ రస్సెల్c(Andre Russell), సునీల్ నరైన్, హెట్ మైర్, పూరన్, హోల్డర్ లతో పాటు ఈ ఏడాది తొలిసారి ఐపీఎల్ ఆడుతోన్న ఒడెన్ స్మిత్, రోవ్ మన్ పావెల్ లు కూడా భారీ క్రేజ్ ను సంపాధించుకున్నారు.
ఇది కూడా చదవండి : ఎవడ్రా వీడికి అంపైర్ గా అవకాశం ఇచ్చింది.. కళ్లను జేబులో పెట్టుకొని అంపైరింగ్ చేస్తున్నాడా..
తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ రస్సెల్ ప్రాక్టీస్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నెట్స్ లో చెమటోడుస్తోన్న రస్సెల్ భారీ షాట్ ఆడగా.. ఆ బంతి కాస్తా వెళ్లి కుర్చీపై పడింది. ఇంకేముంది బుల్లెట్ లా కుర్చీని ఛేదించుకుంటూ వెళ్లిపోయింది. అంతే ఆ చైర్ కు పెద్ద రంధ్రం పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. మీరూ చేసేయండి.
అయితే తాజా ఐపీఎల్ లో కేకేఆర్ పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో తొలుత విజయాలను అందుకున్నా అనంతరం పేలవ ఆటతీరును కనబరుస్తోంది. రస్సెల్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తుండగా.. శ్రేయస్ అయ్యర్ నుంచి గతేడాది స్టార్ వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలు చెత్తాటతో కేకేఆర్ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. ఈ సీజన్ లో కేకేఆర్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడి అందులో కేవలం మూడింటిలో మాత్రమే నెగ్గింది. మిగతా ఐదు మ్యాచ్ ల్లోనూ ఓడింది. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు ఓడటం గమనార్హం. మరో రెండు మ్యాచ్ ల్లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బ తినే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.