IPL 2022: టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? అయితే పూర్తిగా చదవండి మీకే అర్థం అవుతంది. అట్లాంటిక్ (Atlantic ocean)సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. ఇందులో ప్రవేశించే ఓడలు గానీ... ఈ ప్రదేశం గగన తలంలో ప్రవేశించే విమానాలు గానీ కనిపించకుండా పోతుంటాయి. దాంతో ప్రపంచంలో ఇదొక మిస్టరీగా అభివర్ణిస్తారు. అలాగే అమెరికాలోని ఏరియా 51 ప్రాంతాన్ని కూడా. నవేడా ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం కూడా మిస్టరీగా పేర్కొంటారు. తాజాగా ఈ మిస్టరీ జాబితాలోకి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) కూడా చేరాడు. అవును.. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఇతడో పజిల్. బెర్ముడా ట్రయాంగిల్, ఏరియా 51 మిస్టరీలకు ఏవైనా వివరణలు ఇవ్వగలమేమో కానీ.. విజయ్ శంకర్ మిస్టరీకి మాత్రం ఎటువంటి వివరణను ఇవ్వలేము.
గత ఐపీఎల్ సీజన్ వరకు కూడా విజయ్ శంకర్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున ఆడాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఇతడిని రూ. 1.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) సొంతం చేసుకుంది. మనోడికి ఉన్న త్రీ డైమన్షన్ ట్యాగ్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కారణంగా వెంటనే తుది జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక అతడి ఆట తీరును ఒకసారి చూస్తే.. ఈ సీజన్ లో విజయ్ శంకర్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడాడు. అందులో ఇతడి స్కోర్లను పరిశీలిస్తే 4, 13, 2, 0. అయినప్పటికీ ఇతడికి గుజరాత్ అవకాశాలు ఇస్తూనే ఉంది. ప్రతి మ్యాచ్ లోనూ విఫలమవుతోన్న విజయ్ శంకర్ కు ఎలా అవకాశాలు కల్పిస్తారని గుజరాత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా క్రికెట్ లవర్స్ వాపోతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్, ఏరియా 51 ల తర్వాత విజయ్ శంకర్ తుది జట్టులో చోటు ఎలా దక్కించుకుంటున్నాడనే విషయం మిస్టరీ అంటూ మీమ్స్ వస్తున్నాయి.
Greatest mysteries in the world
Bermuda triangle
Area 51
How did Vijay Shankar play for India
— Camlin Oil Pastels 😼 (@CamlinTweets) April 17, 2022
After Newton's discovery of gravity, the next most important discovery on this planet was of Vijay Shankar - 3D player
MSK, thank you, Sir🙏 pic.twitter.com/rYOBLiaIDf
— Blunt 2.0 (@0_blunt) April 17, 2022
#RRvsGT #RRvGT
IPL fans watching Vijay Shankar 2(7) . pic.twitter.com/uATFNEg4Z2
— Anonymous9726 (@Anonymous97261) April 14, 2022
2019 ప్రపంచకప్ కు అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్ ను అప్పటి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారానికే దారి తీసింది. అతడు త్రీ డైమన్షన్ ప్లేయర్ అని అందుకే అతడిని సెలెక్ట్ చేసినట్లు ప్రసాద్ అప్పట్లో పేర్కొన్నాడు .దీనికి త్రి డీ గ్లాస్ తో అంబటి రాయుడు సోషల్ మీడియాలో కౌంటర్ కూడా ఇచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Chennai Super Kings, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Team India