RCB vs GT: IPL 2022 లో భాగంగా RCB vs GT ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. దీనిలో బెంగళూరు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్... 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీని తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం వికేట్లను మాత్రమే కొల్పోయి 169 పరుగులను సునాయసంగా సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (73), ఆఫ్ సెంచరీ సాధించగా, డుప్లెసిస్ (44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గ్లెన్ బ్యాక్స్ వెల్ 18 బంతులలో 40 నాటౌట్ గా ఉన్నాడు. బెంగళూరు 18.3 ఓవర్లలో 170 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన వృద్ధమాన్ సాహా, శుభమ్ గిల్‌లో శుభమ్ గిల్ నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగుకే వెనుదిగిగాడు. అనంతరం వచ్చిన మాథ్యు కూడా 16 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఆ తరువాత వచ్చిన కెప్టెన్ హార్థిక పాండ్యా బ్యాటింగ్ భారాన్ని భుజాన వేసుకున్నాడు. 47 బాల్స్‌లో 62 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. 31 పరుగులు చేసి వృద్ధమాన్ సాహా ఔటైన తరువాత బరిలోకి దిగిన డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చివర్లో 6 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో రషీద్ ఖాన్ 19 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2022