హోమ్ /వార్తలు /క్రీడలు /

Gautam Gambhir On KL Rahul : ఆ గ్యారెంటీ ఉండదు.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు గంభీర్ వార్నింగ్..

Gautam Gambhir On KL Rahul : ఆ గ్యారెంటీ ఉండదు.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు గంభీర్ వార్నింగ్..

Gautam Gambhir On KL Rahul

Gautam Gambhir On KL Rahul

Gautam Gambhir On KL Rahul : గౌతమ్ గంభీర్ నిక్కచ్చిగా మాట్లాడంలో ముందుంటాడు. ఎవరైనా సరే తన అభిప్రాయం చెప్పడంలో ఏ మాత్రం తేడా చూపించడు. లేటెస్ట్ గా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు వార్నింగ్ ఇచ్చాడు గౌతీ.

  ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త‌గా రెండు జ‌ట్లు ప్ర‌వేశించాయి. అందులో ఒక‌టి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) కాగా, మ‌రో జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్‌ (Gujarat Titans). దీంతో ఈ రెండు టీంలు లీగ్‌లో ఎలా ఆడ‌తాయోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ముగిసిన మెగా వేలంలో లక్నో దూకుడు క‌న‌బ‌రిచింది. విశ్లేష‌కుల‌తోపాటు అభిమానుల నుంచి మంచి ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. 21 మంది ఆటగాళ్లను సిద్దం చేసుకున్న జట్టు..యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సవాల్ విసురుతోంది. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ కు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మెంటార్ గా పనిచేయనున్నాడు. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు గౌతీ వార్నింగ్ ఇచ్చాడు.

  ఐపీఎల్​లో జట్టుకు సారథిగా ఉన్నంత మాత్రాన.. భారత క్రికెట్​ జట్టు కెప్టెన్సీకి గ్యారంటీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ గంభీర్​ చురకలంటించాడు. లక్నో టీమ్​కు కావాల్సింది జట్టును నడిపించే బ్యాటర్ కానీ.. బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాదని అన్నాడు. ఈ రెండింటి మధ్య తేడాను రాహుల్ అర్థం చేసుకుంటాడని భావిస్తున్నన్నాడు గంభీర్​.

  "సారథి అనేవాడు మైదానంలో కచ్చితంగా రిస్కు తీసుకోవాలి. కొన్ని సార్లు సరైన సమయంలో రిస్కు తీసుకోకపోతే విజయం సాధిస్తామో లేదో చెప్పలేం. ఇప్పుడు లక్నో జట్టుకు కీపింగ్ కోసం క్వింటన్ డికాక్ ఉన్నాడు కాబట్టి.. ఇక కీపింగ్ బాధ్యతలు రాహుల్ పై ఉండబోవు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ బ్యాటింగ్​, నాయకత్వంపై దృష్టి పెట్టాలి. టీమిండియా భవిష్యత్ కెప్టెన్ అనడానికి.. భారత కెప్టెన్ అనడానికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తనను తాను నిరూపించుకోవడానికి ఐపీఎల్ చక్కటి వేదిక. కెప్టెన్​గా ఎదిగేందుకు ఈ మెగాటోర్నీ​ తోడ్పడుతుంది. అలాగని జాతీయ జట్టుకు కెప్టెన్ అవుతామన్న గ్యారంటీ మాత్రం ఉండదు."అని చెప్పుకొచ్చాడు.

  ఇది కూడా చదవండి : ఐపీఎల్ టిక్కెట్లు కావాలా మామా..? ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి.. ధరలివే..

  జట్టు కూర్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పాడు గంభీర్​. "ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండేలా చూసుకున్నాం. వేలం సమయంలో ఇదే విషయాన్ని జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు చెప్పాను. నా మాటకు ఆయన ఎంతో విలువనిచ్చారు. నా మాటకు అంత గౌరవం ఇస్తారని నేను ఊహించలేదు. అందువల్లే జేసన్ హోల్డర్, దీపక్ హుడా వంటి ఆల్ రౌండర్లను జట్టులోకి తీసుకోగలిగాం" అని గంభీర్​ పేర్కొన్నాడు.

  ల‌క్నో పూర్తి జ‌ట్టు ఇదే

  కేఎల్‌ రాహుల్‌(17 కోట్లు), మార్కస్ స్టొయినిస్‌(9.2 కోట్లు), రవి బిష్ణోయ్‌(4 కోట్లు), అవేశ్‌ ఖాన్‌(10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య(8.25 కోట్లు), ముజరబాని , క్వింటన్ డికాక్‌( 6.75 కోట్లు), దీపక్‌ హుడా(5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్(90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్‌(50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Gautam Gambhir, IPL 2022, KL Rahul, Lucknow Super Giants

  ఉత్తమ కథలు