హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: 3 మ్యాచ్‌లు ఒకే విలన్.. ముంబైను నట్టేట ముంచిన రూ. 2.60 కోట్ల ఆటగాడు.. ఇక, జట్టు నుంచి ఔట్..!

IPL 2022: 3 మ్యాచ్‌లు ఒకే విలన్.. ముంబైను నట్టేట ముంచిన రూ. 2.60 కోట్ల ఆటగాడు.. ఇక, జట్టు నుంచి ఔట్..!

IPL 2022: రూ. 2.60 కోట్లకు లక్నోతో పోటీపడి మరీ కొన్నారు. ఆల్ రౌండర్ కదా.. రెండు విభాగాల్లో సత్తా చాటి.. జట్టును విజయాల బాట పట్టిస్తాడనుకున్నారు. కానీ, ఆ ప్లేయర్ ఇప్పుడు ముంబై జట్టు పాలిట విలన్ గా మారాడు.

IPL 2022: రూ. 2.60 కోట్లకు లక్నోతో పోటీపడి మరీ కొన్నారు. ఆల్ రౌండర్ కదా.. రెండు విభాగాల్లో సత్తా చాటి.. జట్టును విజయాల బాట పట్టిస్తాడనుకున్నారు. కానీ, ఆ ప్లేయర్ ఇప్పుడు ముంబై జట్టు పాలిట విలన్ గా మారాడు.

IPL 2022: రూ. 2.60 కోట్లకు లక్నోతో పోటీపడి మరీ కొన్నారు. ఆల్ రౌండర్ కదా.. రెండు విభాగాల్లో సత్తా చాటి.. జట్టును విజయాల బాట పట్టిస్తాడనుకున్నారు. కానీ, ఆ ప్లేయర్ ఇప్పుడు ముంబై జట్టు పాలిట విలన్ గా మారాడు.

  ఐపీఎల్ 2022 (IPL 2022)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ఢిల్లీ, రాజస్థాన్ చేతిలో ఖంగుతిన్న ముంబై ఇప్పుడు కేకేఆర్ దెబ్బకి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో, పాయింట్ల పట్టికలో తొమ్మిదిస్థానంలో నిలిచింది. అయితే, ఈ మూడు మ్యాచుల్లో ముంబై ఓటమికి కారణం ఒక్కడే. ఇప్పుడు అతడే ముంబై పాలిట విలన్ గా మారాడు. ముంబై జట్టు మూడు ఓటముల్లోనూ అతడిదే కీ రోల్. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ (Daniel Sams). డానియల్ సామ్స్ చెత్త బౌలింగ్.. కోల్ కతా జట్టు చేతిలో ఓటమికి ప్రధాన కారణమైంది. ఇక ప్యాట్ కమిన్స్ ధాటికి డానియల్ సామ్స్ ఒకే ఓవర్‌లో 35 పరుగులిచ్చుకున్నాడు. దీంతో, 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చుకున్న మూడో పేసర్‌గా, తొలి ఓవర్‌సీస్ బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.ఈ చెత్త రికార్డు జాబితాలో 37 పరుగులతో భారత బౌలర్లు పీ పరమేశ్వరన్, హర్షల్ పటేల్ టాప్-2లో కొనసాగుతుండగా.. తాజా చెత్త ప్రదర్శనతో డానియల్ సామ్స్ మూడో స్థానంలో నిలిచాడు.

  కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాలి.. మ్యాచ్‌ మరో మూడు ఓవర్లయినా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కమిన్స్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒక్క ఓవర్లోనే కథ ముగించాడు. సామ్స్‌ (1/50) బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను.. ఆ తర్వాత చివరి రెండు బంతులను 4, 6గా మలచి 16వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు.

  ఇది కూడా చదవండి : పెళ్లికి ముందే శిఖర్ బ్రేకప్ లవ్ స్టోరీ.. తనను రిజెక్ట్ చేసిన ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే..

  బంతి ఎలా, ఎక్కడ పడ్డా దానికి బౌండరీ దారే చూపించాడు. మధ్యలో ఓ బంతిని బౌండరీ దగ్గర సిక్సర్‌ వెళ్లకుండా సూర్య అద్భుతంగా అందుకున్నప్పటికీ అది నోబాల్‌గా తేలింది. అయితే సూర్య సూపర్ ఫీల్డింగ్‌తో 4 పరుగులు సేవ్ అయ్యాయి. అది గనుక సిక్స్ వెళ్లి ఉంటే.. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఓవర్‌లో 39 పరుగులు ఇచ్చిన చెత్త బౌలర్‌గా సామ్స్ అప్రతిష్టను మూటగట్టుకునేవాడు.

  ఇక, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాల్సిన స్థితిలో ఉండగా, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో మొదటి బంతికే అనవసరపు షాట్ కు యత్నించి డకౌటయ్యాడు. క్రీజులో ఉన్న పొలార్డ్ కు సహాయం చేయకుండా.. అనవసరపు షాట్ ఆడి.. ముంబైని కష్టాల్లోకి నెట్టాడు.

  ఇక, ఢిల్లీతో జరిగిన మ్యాచులో కూడా దాదాపు ముంబై వైపే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. అయితే డానియల్ సామ్ ఓవర్లో లలిత్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ 24 పరుగులు చేశారు. ఢిల్లీ విజయానికి చివరి 3 ఓవర్లలో 28 పరుగులు అవసరం అవ్వగా.. సామ్స్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకుని.. ఢిల్లీ విజయాన్ని సులభం చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో మనోడి ఆటతీరును దృష్టిలో ఉంచుకుని, ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కడం కష్టమే. ఐపీఎల్ వేలంలో డేనియల్ సామ్స్ బేస్ ధర రూ. కోటి కాగా, ముంబై అతడిని రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది. సామ్స్ ను కొనుగోలు చేసేందుకు ముంబై, లక్నో జట్లు పోటీ పడ్డాయ్.

  First published:

  Tags: Cricket, IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Pat cummins, Rohit sharma

  ఉత్తమ కథలు