IPL 2022 UNSOLD IRELAND PLAYER PAUL STIRLING SMASHES 46 BALL HUNDERED AND HITS 34 RUNS IN AN OVER IN VITALITY BLAST SRD
Viral Video : 6,6,6,6,6,4..IPL వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ, విధ్వంసాన్ని పరిచయం చేశాడు..
Paul Stirling
Viral Video : ఐపీఎల్ వేలంలో ఆ ఆటగాణ్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ప్రపంచానికి తన స్టామినా ఏంటో చూపాడు. క్రీజులో కుదురుకుంటే తాను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూపించాడు.
క్రికెట్ (Cricket) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఆడాలనేది ప్రపంచంలోని ప్రతి క్రీడాకారుడి కల, కానీ ఈ టోర్నీలో అందరికీ అవకాశం లభించదు. ఈ ఏడాది వేలంలో అమ్ముడుపోని రజత్ పాటిదార్ (Rajat Patidar), గాయపడిన ఆటగాడి స్థానంలో అవకాశం పొందాడు. RCB తరపున బరిలోకి దిగిన ఈ యంగ్ బ్యాటర్ ఈ సీజన్ లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఇక, ఇప్పుడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని మరో ఆటగాడు విధ్వంసం అంటే ఏంటో రుచి చూపించాడు. ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు , ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
టీ20 బ్లాస్ట్‌లో ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ (Paul Stirling)ఈ దూకుడును ప్రదర్శించాడు. మరోసారి విధ్వంసం సృష్టించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 51 బంతులు ఎదుర్కున్న స్టిర్లింగ్ 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 119 పరుగులు చేశాడు. ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 34 పరుగులు చేశాడు. స్టెర్లింగ్ 19 ఏళ్ల జేమ్స్ సేల్స్ కు చుక్కలు చూపించాడు. అతని ఓవర్ లోనే ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టీ20 క్రికెట్‌లో స్టెర్లింగ్‌కి ఇది మూడో సెంచరీ. ఈ సెంచరీతో టీ20 క్రికెట్‌లో 7,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టీ20 క్రికెట్‌లో 7,000 పరుగులు చేసిన తొలి ఐర్లాండ్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. సామ్ హెయిన్‌తో కలిసి మూడో వికెట్‌కు స్టెర్లింగ్ 70 బంతుల్లో 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హెయిన్ 32 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన నార్తాంప్టన్‌షైర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 81 పరుగులకే ఆలౌట్ అయింది. ముగ్గురు బ్యాటర్లు రెండంకెల స్కోర్లు దాటగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. వార్‌విక్‌షైర్ బౌలర్లలో డానీ బ్రిగ్స్, జాక్ లింటోట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హెన్రీ బ్రూక్స్ 2 వికెట్లు.. బ్రాత్‌వైట్, మైల్స్ ఒక్కో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్ 125 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.