హోమ్ /వార్తలు /క్రీడలు /

Rinku Singh : ’బాధ ఎందుకు రింకూ.. మేమంతా నీ వెంటే‘.. కేకేఆర్ స్టార్ పై వెల్లువెత్తుతోన్న నీరాజనాలు

Rinku Singh : ’బాధ ఎందుకు రింకూ.. మేమంతా నీ వెంటే‘.. కేకేఆర్ స్టార్ పై వెల్లువెత్తుతోన్న నీరాజనాలు

కంటతడి పెడుతోన్న రింకూ సింగ్ (PC : TWITTER)

కంటతడి పెడుతోన్న రింకూ సింగ్ (PC : TWITTER)

Rinku Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరమూ చెప్పలేం. ఒక్క మ్యాచ్ తో స్టార్ ప్లేయర్స్ జీరోలుగా.. అనామక ప్లేయర్స్ హీరోలుగా మారడం చూస్తుంటాం.

Rinku Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరమూ చెప్పలేం. ఒక్క మ్యాచ్ తో స్టార్ ప్లేయర్స్ జీరోలుగా.. అనామక ప్లేయర్స్ హీరోలుగా మారడం చూస్తుంటాం. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరిగిన మ్యాచ్ ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders) బ్యాటర్ రింకూ సింగ్ రాత్రికి రాత్రి అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశాడు. తన అసాధారణ బ్యాటింగ్ తో భారీ ఓటమి తప్పుదనుకున్న కేకేఆర్ ను దాదాపుగా గెలిపించేంత పని చేశాడు. ఈ 24 ఏళ్ల కుర్రాడు ఆడుతుంటూ గంభీర్ లాంటి దిగ్గజ ప్లేయర్ డగౌట్ లో కూర్చొని వణికిపోవడం చూశాం. వందల కొద్ది అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవం ఉన్న కేఎల్ రాహుల్, స్టొయినస్, క్వింటన్ డికాక్, జేసన్ హోల్డర్  లాంటి వారు రింకూ సింగ్ కు ఎలాంటి ఫీల్డ్ ను సెట్ చేయాలో తెలియక గందరగొళానికి గురయ్యారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇది కూడా చదవండి : లక్నో గెలిచినా.. హృదయాలను గెలుచుకున్న రింకూ సింగ్.. వాట్ ఏ నాక్..

కేకేఆర్ ఆఖరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సిన తరుణంలో రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2 సాధించాడు. దాంతో నాలుగు బంతుల్లోనే కేకేఆర్ కు 18 పరుగులు సమకూరాయి. ఆఖరి రెండు బంతుల్లో 3 పరుగులు వస్తే చాలు. ఈ క్రమంలో రింకూ సింగ్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. అయితే ఎవిన్ లూయిస్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ కు రింకూ సింగ్  అద్భుత ఇన్నింగ్స్ తెరపడింది. అనంతరం ఆఖరి బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ లో లక్నో 2 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ కంటతడి పెట్టడం చాలా మంది క్రికెట్ అభిమానులను బాధ పెట్టింది. జట్టును గెలిపించలేకపోయాననే బాధతో మ్యాచ్ ముగిసిన తర్వాత రింకూ సింగ్ ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వీరుడు బాధ పడకూడదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కేకేఆర్ అయితే రింకూ సింగ్ ముందర మోకరిల్లిన అవెంజర్స్ టీమ్ తో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రింకూ సింగ్ నీరాజనాలు అందుకుంటున్నాడు.

ఈ మ్యాచ్ ల ోరింకూ సింగ్ 15 బంతుల్లో 40 పరగులు చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ 40 పరుగుల ముందు క్వింటన్ డికాక్ 140 పరుగులు ఓడిపోయిందనే చెప్పాలి. అలా అని డికాక్ ఇన్నింగ్స్ ను తక్కువ చేసి చూపలేం. కానీ, లక్నోపై రింకూ సింగ్ ఇన్నింగ్స్.. అదే విధంగా ఎవిన్ లూయిస్ క్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

First published:

Tags: Andre Russell, Gautam Gambhir, IPL, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer

ఉత్తమ కథలు